పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

47

తన్నుఁ దన్ని ఏమిరా! లుచ్ఛా! నీ వెందు కఱచెదవురా, యని భయంకర ముగఁ గేకవైచెను. బానిసయు వడఁకుచు, “స్వామి? పాలిఖిల్లాదారు రహిమాను ఖాను వచ్చియున్నాడు. సెలవుదయచేసిన పక్షమునఁ దమపాదముల సన్నిధికిఁ దోడుకొని వచ్చెద” నని పలుకుటయుఁ జక్రవర్తి తనయంగీకార సూచకముగఁదల యూఁచిన, సేవకుడు ఖానుగారిని వెంటఁబెట్టుకొని వచ్చి గదిలోనికంపి తానావల నిలుచుండెను. ఖానుసాహేబు పాలి గ్రామమున వసించునప్పటి గర్వమును వదలి చక్రవర్తి సమ్ముఖమున నేలఁబడి తత్పాదముల నంటి సలామొనర్చెను. చక్రవర్తియు వానిని జూడఁగానే వాని దురాచారములఁ గూర్చి నాజరుజంగు విన్నవించినయంశములు జ్ఞప్తికిరా మండిపడి, ఓరీ! రాజద్రోహి మాదేశమునఁ గల ద్రవ్యవంతులను సామంతులను దోపించుటకా నీకధికారమిచ్చినది? చీ! నీమొగముఁ జూడరాదు. నీవు నాయెదుట నుండి పో, యని తనపాదములపైఁ బడియున్న యాతనిఁ ద్రోసివైచి రెండు తన్నులు దన్నెను. స్త్రీవలె రోదనము జేయుచు, “ఓ మహమ్మదీయ మత సంరక్షకా! ఓ సకలలోక చక్రవర్తి! నేను మీబానిసను, నేనేపాప మెఱుఁగను, నిర్హేతక ముగ నామీదనోర్వలేక తుచ్ఛులెవరో నేరములు జెప్పినా రని” విలపించు చున్న యా నిర్భాగ్యునిఁ జూచి చక్రవర్తి యించుక కరణించి, నీ నిర్దోషత్వమును నీవెట్లు స్థాపింపగలవు? అట్లు చేసికొనిన పక్షముననే నీ ప్రాణములు దక్కగలవు. ఱేపు సాయంకాలము వఱకు నీకు గడు విచ్చినాను. ఱేపు రాత్రిదర్భారు. ఆసమయమునకు నీవుసంసిద్ధుండవై యుండవలెనని పలికి యాపూటకు క్షమియించెను. ఈ వాక్యములతో మనశ్శాంతి కలిగి రహిమానుఖానుసంతోషించి మహాప్రభూ! ఏలినవారు ధర్మమూర్తులు. ఱేపు సాయంకాలము నేను నిర్దోషినని స్థాపించుకొనగలను. అంతేగాక రాజపుత్ర