పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

45

ఢిల్లీకి సామంతరాజుగ నుండునట్లును గప్పము గట్టునట్లును, నొడఁబఱచి బహు నగరములను గొల్లగొన్న దోఁపిడిధనముతోడను కానుకలతోడను బినతండ్రి నెదుర్కొనుట కరిగెను. అరిగిన తోడనే యఁతడు పినతండ్రిని జంపించి తాను జక్రవర్తి కాఁగోరి యపారసేనాసమేతుఁ డయియుండుటచే దన మనోరథమును సులభముగ నెఱువేర్చుకొని మహావైభవముతో 1205 వ సంవత్సరమున సింహాసన మెక్కి 1216 సంవత్సరమువఱకును రాజ్యము చేసెను. ఈతఁడు లోకవ్యవహారములం దారితేఱిన దిట్టరియేకాని కుటిలుఁడు. కార్యసాధన మొనర్పఁగల బాహుళశాలియె కాని నీతిలేనివాఁడు. ఈతఁ డుత్తర హిందూస్థానమును దాదాపుగ స్వాధీనము జేసికొనెను. రాజపుత్రస్థానమును జయింపలేదు. ఆతఁడు సింహాసనమెక్కునాఁటికి దక్షిణమున మహారాష్ట్రముదక్క దక్కినదేశము లెవ్వియు వానిపాలనమునకు లోఁబడియుండ లేదు. దేవగిరి, మహారాష్ట్ర సామంతుఁడగు రామదే వేలుచుండెను, ఓరగల్లు రాజధానిగఁ ద్రిలింగదేశము కాకతీయవంశజ్ఞులు పాలించుచుండిరి. భిలాలు వంశస్థులు ద్వారసముద్రమునుండి మైసూరు రాజ్యము నేలుచుండిరి. కర్ణాటకమును స్వదేశ రాజులు పాలింపుచుండిరి. రాజ్యస్థాపమును దక్షిణ రాజ్యములను స్వాధీనపఱచుకొనవలయునని మాలికాఫరును సేనానాయకుని గొప్ప సైన్యముతో పంపగా నతఁడును దన ప్రభువువలె నీతిసంపత్తి లేనివాఁ డగుటచే మాయచేతనో బలముచేతనో స్వదేశ ప్రభువుల నడచి రామేశ్వరము వఱకుగల దేశమును జయించి యనేక పురాతన రాజకుటుంబముల నిర్మూలన మొనర్చెను. ఈతఁడు దక్షిణ దేశమందుండ జక్రవర్తి రాజస్థానఁడయాత్రను గూర్చి యోజించుచుండెను. ఢిల్లీనగరమునందున్న సైన్యమును జాల కాలమునుండి యుద్ధమునకు సిద్ధమగునట్లు జేయుచు నితర మండలములయం