పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

మహమ్మదీయులు భరతఖండమును బరిపాలించినంత కాలమును ఢిల్లీ నగరము రాజధానియైయుండెను. ఈ ఢిల్లీ చక్రవర్తులె రారాజులవలనఁ గప్పములు గ్రహించి మూర్దాభిషిక్తులను బాదాక్రాంతులఁ జేసిరి. చక్రవర్తులె యాసేతుహిమాచలమగు భరతఖండము నేకచ్ఛత్రముగఁ బాలించిరి గజనీ మహమ్మదు పండ్రెండు సారులు హిందూదేశముపై దండెత్తి దేశమునెల్లఁ గొల్లగొని లక్ష్మిని దనవెంటఁ గొని దారిద్ర్యదేవత నిట నిలిపి చిన్నయనంతరము మహమ్మదు గోరి యను నతఁడు ఢిల్లీ మహారాజుగ నుండిన పృథ్వీమహారాజును ధనేశ్వర యుద్ధమున వధించి దేశము నాక్రమించెను. తన్మరణానంతరము బానిసరాజులు 1206 మొదలు 1210 వఱకు నుత్తర హిందూస్థానమును బాలించిరి. వారు బలహీనులయినవెనుక వృద్ధుఁడయ్యు జలాలుద్దీను భుజబలముచే బానిసలను గెల్చి, సింహాసన మెక్కి, కిల్జీవంశ స్థాపకుఁడయ్యెను. జలాలుద్దీన్ చక్రవర్తి 1290 మొదలు 1295 వ సంవత్సరమువఱకు మాత్రము పరిపాలించెను. రాజ్యకాల కాలము స్వల్పమైనను మహమ్మదీయ లదివఱకెన్నఁడు నెఱుఁగని దక్షిణహిందూదేశము పై ప్రథమ దండయాత్ర 1294వ సంవత్సరమున జరగెను. అది జలాలుద్దీనునకు నన్న కుమారుఁడును కపటోపాయ ధురీణుఁడును, రాజనీతివిశారదుఁడు నగు నల్లాయుద్దీను సేనానాయకుఁడై నడిపి మహారాష్ట్రదేశము నాక్రమించెను. ఆ కాలమున మహారాష్ట్రదేశమున దేవగిరినగరము రాజధానియై యుండెను. అల్లాయుద్దీను మహారాష్ట్ర దేశాధీశ్వరుఁడగు రామదేవమహారాజును గెల్చి యాతడు