పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

43

జదువుకొని నగలకంటెవానికయి సంతోషించుచు నెవరును జూడకుండ రవికెలోఁబెట్టికాని పోయెను. అటు మదోన్మతుఁడై చిత్తవైకల్యముగలిగి ప్రవర్తించు రహిమానుఖానునకు నల్లాయుద్దీనుజక్రవర్తి యొద్దనుండి పరమానా యొకటివచ్చెను. చిత్తూరుదండయాత్రను గూర్చి ఖిల్లాదారులతో నెల్ల యోజింపవలసియున్నదని ఖానును జక్రవర్తి రమ్మనెను. నిరంకుశముగు చక్రవర్తి యుత్తరువు నతిక్రమింపఁ జాలక యొక వారములో ఢిల్లీకిఁబోవుచు, సింగును మౌలవిని విడువవలదని తనక్రింది యధికారితోఁ జెప్పి చనెను. గ్రామస్థులందఱును హేమలత బలవంతముగ మృతినొందెనని నిశ్చయించిరి.