పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

హేమలత

కలిగి యశక్తుఁడయి నిరాధారుఁడయి గ్రుడ్డితనమునఁ గదలలేక యతి దీనుఁడయి కాలముఁబుచ్చుచున్న నారాయణసింగు చేయిపట్టుకొని కఠిన స్వరముతో నీదౌర్జన్యమును గుట్రలును విని నిన్నుఁ దక్షణమే పట్టికొని చెఱసాల యందుంచవలసినదని, చక్రవర్తిగారు మాకుత్తరువునంపినారు. అందుచేత నిదిగో నిన్నిపుడు పట్టికున్నాను” అని చెప్పి “ఱెక్కలు విఱచి కట్టుడు జాగ్రత్త”యని సేవకులతో నుడివెను. కర్ణశూలములవలెనున్న యాపలుకులు విని నిశ్చేష్టుఁడయి వృద్ధుఁడు నిలువఁబడి “అమ్మా! హేమలతా!” యని కేక వైచి “అయ్యయ్యో! నేనేమిచేసినాను. నావలననేమి యపరాధము వచ్చినది. చక్రవర్తి యుత్తరువు నేనెన్నఁడు నతిక్రమించలేదు. నన్ను బట్టికొనుట యన్యాయము. నన్ను విడువుఁడు, అని దీనస్వరముతో మనవి చేసికొనుచున్న వృద్ధుని మాటలను జెవినిడక రాజభటులు గట్టిగ బిగియఁదీసి ఱెక్కలు నొప్పి పెట్టునట్లు వెనుకకు విఱచికట్టిరి. నారాయణసింగు దీనాలాపముల నాలకించి రాజాథటులుగూడ దయగల వారయిరి. కాని మూర్తీభవించిన పాపదేవతయగు రహిమానుఖాను వాని విలాపమును చూచి, “ఓరీ. బద్మాష్ లుచ్చా! ముసలిదొంగ. నోరుమూసికొనుము, లేకున్న కొరడా దెబ్బలు తినెదవు. ఏమియునెఱుగని వానివలె నఱచెదవేమి! నీవు రాజపుత్రులను గలిసి చక్రవర్తి మీద గుట్రలు చేయుచున్నావు. మీయింట బసచేసిన మదనసింగుతో నీవు మాట్లాడిన రహస్యముల నేనెఱుఁగుదును. నాజరుజంగు నీ కుట్రలనెల్లఁ జక్రవర్తితోఁ, జెప్పినాఁడు. అందుచేత నాతఁడు నిన్నుఁ గారాగృహమున కంపుమని యాజ్ఞయొసఁగెను. నీ పాపము నీవే యనుభవింపుమని నిష్ఠురముగఁ బలుకఁ దనపై వచ్చిన యపవాదమునకును దురవస్థకును మిగులఁగుందుచు వృద్ధుఁడుండ నీకోలాహలమంతయు విని హేమలత