పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

35

లించెను. అప్పటినుండియు నీ దురాత్మురాలు ఖాను ప్రసంగములను మానుకొని నందునితో “నిఁక హేమలతపై ఖానున కాశ యుండఁ దగదు ఆమె కితనియందిష్టము లేదు. మదనసింగున కామె ప్రాణములలిచ్చు” నని చెప్పఁగా ఖానుతో నందుఁ డావార్త విన్నవించునపుడు వానికిఁ గలిగిన దుఃఖము వర్ణింపనలవి కాదయెనని యిట నేను వ్రాయనక్కఱ లేదు. కామోద్రేకమును విచారమును మల్లడిగొన మహమ్మదీయుఁడు హేమలత నెట్లయిన జేసికొని తీరవలయునని కృతనిశ్చయుడై నారాయణసింగునకు మౌలవికిని మిత్రభేదము గల్పింపఁ బ్రయత్నించెను. గాని యందుఁ గృతార్థుఁడు గానేరక పోయెను. అందుచేత, నందుఁడును, ఖానును, యితర సేవకులు దగు నుపాయమును వెదకు చుండిరి.

అది యిట్లుండ ఖానునకు హేమలతయందు దృఢమోహము దగుల్కొన్నదని జనులు చెప్పుకొనుటవలన కర్ణాకర్ణిని నారాయణసింగును మౌలవియు, హేమలతయు విని యేసమయమున నెట్టి యపాయము మూఁడు నోయని భయపడుచుండిరి. విదేశీయు లయిన వారిని రక్షించుట దనకు విధియని మౌలవి వారిక పాయము రాకుండగ నేమిచేయుదునా యని చింతింపుచుండెను. మదనసింగు వద్దనుంచి యిప్పటికి నాలుగైదు మాసమ్ములు గడచినను వర్తమాన మేదియు రానందున నతఁడు తమవిషయమయి మఱచినాఁడని వారాలోచించి నిరాశ పడి గతితోఁచక యుండిరి. తుదకు వారందఱు నాలోచించి వృద్ధుడు మనుమరాలును నక్కడకు నాలుగైదు క్రోసుల దూరముననున్న యలీఘరపురమునకుఁ బోవలెనని నిశ్చయించిరి. అందుచే మాలవి వారిని బ్రయాణముచేసి యాయూరందనకుఁ గల యిర్వురు ముఖ్య