పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

హేమలత

మనోరధమును దెలియపఱచి కార్యసాధ్యము జేయుమని ప్రార్థించెను. నందునిమాటఁ దీసి వైవలేక రాధ యందున కియ్యకొని బావాజీ మఠమున కనుదినమును బోయి హేమలతతో నేదోవంకఁ బెట్టి మాటలాడుచు నామె పరిచయమును సంపాదించెను. పరిచయ మయినది మెదలు హేమలత కామె పనిపాటలు చేయుచు వినోదకథలను జెప్పి యామెను నవ్వించుచు నుండెను గాని దుస్సహవాస మొనర్చుట కిష్టములేక రాధతోఁ దిన్నగా మన హేమలత మాటలాడ దయ్యెను. ఈ ప్రకారము మదనసింగు పాలి గ్రామమున నున్న కాలముననె రాధ రెండు సారులు హేమలత కొఱకు వచ్చి సింగును జూచి మోహించి యాతనితో మాటలాడఁ బ్రయత్నించిన దయ్యు నతఁడు ప్రత్యుత్తర మొఁసగ కుండుటచే మరలవలసిన దయ్యెను. రాధకు మదనసింగు నందుగల మోహ మతిశయింప దాసిగ నున్నతన యంతరమును రాజ పుత్రుండఁగు నతని యంతరమును నాలోచింపక యెట్లయిననతనిఁ దనవలలో వైచికొన వలయునని యామె యత్నింపుచుండెమ. హేమలతకు సింగునం దనురాగము గలదని యెఱిగి యామెయం దసూయ మనస్సున నిల్పి రహీమాన్ ఖానున కీమెను సమకూర్చునెడలఁ దనకు సవతి, నీమెయుండదని నమ్మి మదససింగునుదాను స్వాధీనపఱుచుకొనవచ్చునని నిశ్చయించెను. అందుకే “నేకక్రియాద్వ్యర్థకరీ” యని యామె ఖానున కపకార మొనర్చు నట్టును దన మనోరథము నీడేర్చుకొని నట్లును గూడ నగునని రాధ హేమలత మనస్సు విఱుచుటకై ప్రయత్నించి యప్పుడప్పుడును ఖాను యొక్క గుణ రూపముల నామెకడ వర్ణించుచుండెను. ఒకనాఁడు ఖాను యొక్క రూపాతి శయమును రాధ వర్ణింప గా శరీరమువడఁక హేమలత భయమంది యాతని ప్రసంగమును దనవద్ద నెన్నడును దేవద్దని యామెను గఠినముగా మంద