పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

31

కపాయము కలుగునప్పుడు సహాయ మొసగుఁమని చెప్పి వానిచేనట్లు చేయుటకు వాగ్దానముల గ్రహించి యారాత్రి బయలుదేఱి వెళ్ళెను. మాలవి యాగ్రామమునందు జపమిత్రుండును భగవత్సేవాపరాణుఁడు నయి యుండుటచేఁ బ్రజల కతనియం దతిగౌరవము కలదు. నారాయణ సింగును వైద్యమూలమున సకలజనోపకారి యగుటచేత బ్రజలలెల్ల నతని కాప్తులయిరి. ఈ పరిచయములవలన మౌలవియు నారాయణసింగును మిత్రులై తమతమ మతములఁ గూర్చి వాదములు సలుపుచు సుఖముగఁ గాలమును బుచ్చుచుండిరి.