పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

15

మదనసింగునకు సహాయమొనర్ప వలసినదని పంపెను. నాజరుజంగు హిందూస్థాననివాసులకు మహమ్మదీయులలో బ్రఖ్యాతిగన్న వంశభూతుఁడై గుణములచేఁ దనవంశమునకు గీర్తిఁ దెచ్చుచుండెను. చక్రవర్తి కాతనియందు గొంత నమ్మకము గలదు. మదనసింగు నాజరుజంగును సహజసద్గుణ సంపన్నులు గనుక నాగ్రానగరమునం దున్నప్పు డిరువురకు స్నేహమయ్యేను. అట్లిద్దఱును బయలుదేరి పాలిగ్రామమునకు వచ్చుచుండగా మార్గమధ్యమున బందిపోటు దొంగలసంఘ మొకటి వారి పైబడి శౌర్యరాసియగు మదనసింగు నాజరుసహాయమున దొంగలనందలఁ బాఱఁదోలి యందనేకుల వధించెను. స్వభావసిద్ధముగ నతఁడు మోటచొరవయుఁ దిగువయుఁగల శరీరలక్ష్యము లేని సాహసుండగుటచే సంపూర్ణ జయమునొందినను మెడమీఁదఁ జిటికినవ్రేలు పొడుగుగల గాయము నొందవలసిన వచ్చెను. ఎండవేఁడిమిచేతను, గాయపుమంట చేతను దాళఁజాలక రెండుమూడు పర్యాయము లతఁడు మూర్ఛిల్ల సిద్ధముగ నుడి వెంటనే తెలివిఁదెచ్చుకొని కష్టముమీఁదఁ బ్రయాణ మొనర్చుచుండెను. ఏకధారగ స్రవించుచుఁ జూపఱకుఁ గనులు మిఱుమిట్లుగొలుపు రక్తముచే నతని యుంగరకాలన్నియుఁ దడిసి శరీరమున కంటుకొనిపోయి మిగుల బాధకరముగ నుండెను. మదనసింగుతోఁ జిత్తూరునుండి వచ్చిన సేవకు లేవురును భయకంపితులై నోట మాట లేక హృదయస్థిత విచారమును నేత్రబాష్పములవలనఁ దెలియఁజేయుచుండిరి. స్వల్పకాల పరిచయుఁడైనను నాజరుజంగు తన మిత్రుని యవస్థకు మిగులఁ గుందుచు నతనికి ధైర్యముఁ గలిగించుటకు బహువిధ ప్రయత్నములు సలిపెఁగాని యవియెల్ల వ్యర్థములయ్యెను, కొంతసేపు నిశ్శబ్దముగ నయ్యాశ్వికులు నడిచిరికాని తుదకు నాజరుజంగు రసపుత్రకుమారు బలుకరించె. “నాలుగు