పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

145

వధించుటయు, గ్రామస్థులు తన్ను విడిపించి హేమలతను వెదకించి యెందును గానకుండుటయుఁ జెప్పి యామె చిత్తూరు నందున్నదేమో యని మోలవిని సహాయములఁదీసికొని నేనిటకు వచ్చినాఁడను. ఈతని దయవలన నేనాపద నుండి బయట బడితిని. అన్యమతస్థుఁడైనను నీతఁడు నాకొనర్చిన యుపకారమునకు నే నీతని బుణము నెన్ని జన్మలకైనను దీర్పఁజాలను. మా హేమలత యెందును లేదని మీరనుచున్నారుగద. అయ్యో! నేనేమి చేయుదును? ఆమె యిక్కడనుండునని గంపంతయాశతో వచ్చినాఁడను. ఇంక నే మృతినొందుట మేలుగాని జీవించుట మేలుగాదు. ఈ మౌలని నన్ను నమ్ముకొని చక్రవర్తి రాజ్యమును బాసి చిత్తూరునఁ గాపుర ముండ నిశ్చయించుకొని వచ్చినాఁడు. నే నొకవేళ మృతినొందినను నీవీ మౌలవి సాహెబున కుపకారము జేసి యిక్కడనుండునట్లు జేయుము. అని చెప్పు నారాయణసింగు పలుకులు విని మదనసిం గబ్దుల్ ఖరీమున కభయ మిచ్చి హేమలతను వెదకించు చుండెను,