పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

143

నారంభించెను. సువర్ణబాయి కుమారుని గౌగిలించికొని నాయనగారు పోవుచున్నారు తండ్రీ! యని రోదన మారంభించెను. అంతట మదనసింగు ప్రతాపసింగు మొగము మీద మొగముబెట్టుకొని “కక్కా, నేను దల్లిదండ్రుల నెఱుగను. నీవేనన్ను గారాబముతో దండ్రి లేని లోపము కనఁబడకుండఁ బెంచినావు. అయ్యో! నన్ను విడిచిపోయెదవా! నాకెవరు దిక్కు? నే నింక నెట్లు జీవింతును?” అని వాపోవఁదొడఁగెను. శౌర్యరాశియగు ప్రతాపసింగు వానిని వారించి “నాయనా! నీవు రాజపుత్రుఁడ వగుదువా, కావా? మరణ మెన్నడయిన దప్పదుగద. నేను వీరపురుషోచితి మగు మరణము నొందుచుచున్నాను. దేశస్వాతంత్ర్యమునకు బోరాడి మృతినొందుచున్న నన్ను గూర్చి సంతోషించుటకు మాఱు దుఃఖించెద వేల? నీవు రాజభక్తి గలిగి జాగ్రత్తగ నుండుము.” అని యోదార్చి భీమసింగును మహారాణాలక్ష్మణసింగును బిలిచి మదనసింగును జూపి “అయ్యా! నాకును మాయన్నయగు మాధవసింగునకు నితఁడే కుమారుఁడు. ఈతని మీ కుమారునిగ నెంచికొని లోపములను క్షమియించి రక్షించి కొనుడు” అని చేతిలో జేయి వైచి యప్పగించెను. ఇంతలో బ్రతాపసింగున కాయాసము రాఁగా నందఱును రామ రామ యనుచు హరినామస్మరణ మొనర్చిరి. అప్పుడు భగవద్ధ్యానముతోఁ బ్రతాపసింగు లోకాంతరమున కరిగెను. తరువాత నమిత గౌరవముతో నూరేగించి ప్రతాపునకు భీమసింగు దహనసంస్కారములు జేయించెను. మదనసింగు పినతండ్రి కుత్తరక్రియలు చేసి పితృ ఋణమును దీర్చికొని పిత్రవియోగమునకు హేమలతా వియోగముతోడ్పడ జింతిల్లుచుండ సువర్ణ బాయియెఱిగి కుమారునిజూచి “నాయనా! నీవింక