పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

141

మద – అయ్యో! నాకాసంగతి తెలియదయ్యెను. నేనేమి చేయుదును? నాకామె దొరకు టెట్లు! దైవము నాయెడ నిర్దయుడై యున్నాడు.

కుమా – నీ కామెయం దంత ప్రేమ యేల? నీ వామెను వివాహ మాడెదవా యేమి? నీకామెపై ననురాగ మున్నట్టు లామెకు నీపై నుండునా?

మద – నీవాలాగున ననబోకుము. ఆమెకు నాయందనురాగమున్నది. ఆమె యెందున్నదో నేనెఱుగగోరు చున్నాను. దయచేసి నీవు చెప్పుము. ఆమె నిజముగ నీశిబిరముతో వచ్చినదా అట్లయిన నామె కొఱకు వెదకుదము నాతోరమ్ము.

అని మదనసిం గాత్రముతో నడుగ గుమారసింగు మందహాసముతో “నీవు తొందరపడకుము. తెల్లవారినదాక నోపిక పట్టుము” అని చెప్పి పాలిగ్రామమున రహిమానుఖాను హేమలత విషయమున జరిగించిన దౌర్జన్యమును, నారాయణసింగును జెఱసాల కంపుటయు, హేమలత గోసాయీ దయవలన కుల్వానగరమున శివప్రసాదు నింట నుండుటయు, మాయోపాయమున నామెను రహిమానుఖాను ఢిల్లీకి దీసి కొనిపోయి బలాత్కరింపజూచుటయు జంద్రసేనుని దయవలన బాధా విముక్తినొంది యామె చక్రవర్తి శిబిరముతో వచ్చుటయు నాదిగా గల పూర్వ వృత్తాంతము నెఱిగించెను. రహిమాను ఖాను చేసిన దౌర్జన్యమును విని సింగు మిగుల విచారమునొంది హేమలతపై జాలియుననురాగము నెక్కువకాగా నామెను జూపు మని కుమారసింగును వేగిరిపెట్టెను కాని యత డేమియు జెప్పక