పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

139

దగ్గఱకుఁ దీసికొనివచ్చిరి. భీమసింగును వానిస్థితిని బట్టి యతఁడు జీవించుట దుర్ఘటమని యెంచినను బ్రాణములున్నంతవఱకు మనుష్య ప్రయత్నములు మానుట యనుచితమగుటచే వ్రణవైద్యునికాతని నప్పగించి, తమ మందిరమునకుఁ గొనిపోవ నియమించెను. పినతండ్రి భీమసింగు నొద్ద సురక్షితుడై యున్న వార్త మదనసింగు విని గాయములు తగిలి ప్రాణములతో యుద్ధ భూమిని బడియున్న తన యాప్తులగు రసపుత్రుల కౌషధ మిప్పించి బ్రదికింపదలఁచి కొందఱు రాజపుత్రులతో యుద్ధ భూమిని సంచరించు చుండెను. రహిమానుఖాను ప్రాణభీతిచే ఖడ్గమును దాఁచి యంతఃపుర స్త్రీవలె నొక పల్లకిలో యుద్ధము ముగియు వఱకుఁ గూర్చుండి తమ సైన్యమును శత్రు సైన్యమును యుద్ధభూమిని విడిచిన తరువాత బల్లకీ తలుపులు తెఱచి బైటకు వచ్చి మెల్లగా నడుచుచుండెను. అతడట్లు పోవుచుండ నతని యదృష్టహీనతచే మార్గమున మదనసింగెదురు పడెను. అతని జూచిన తోడనే ఖానుసాహెబుగారు మీది ప్రాణములు మీదనై పోవ జీవచ్ఛవమువలె నిలువబడి తనకు మరణ మతనిచే దప్పదని శూరుని చావుచచ్చుట కిష్టముగలుగ ఖడ్గమును జేతబట్టుకొని మదనసింగుపై బడ వరిగెను. మదనసింగతని యేటు దప్పించుకొని మ్లేచ్ఛ సేనానాయకుడుక్కు దక్కి నేల వ్రాలునట్లొక దెబ్బకొట్టెను. బాటసారులను దోపించిన పాతకమును స్త్రీలను జెఱబెట్టిన దోషమును నిరపరాధులపై జక్రవర్తి కాగ్రహము గలిగించిన క్రౌర్యమును వాని కా సమయమున జ్ఞప్తికి రా నతడు మనః క్లేశమునొంది తుదకు మహమ్మదువారిని సర్వేశ్వరుడైన యల్లాను దలచికొన మక్కావైపు మొగముద్రిప్పి ప్రాణమువిడిచి కొనెను. తనమిత్రులకు మందు