పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

137

స్త్రీ లార్తనాదములతో నటు నిటు బరువులిడ మ్లేచ్ఛ సైన్యమున గలవలమును బాధయు నధికమయ్యెను. ఎచట జాచిన ఏనుగులు, నెచట గనుగొన్న రక్తప్రవాహములు, నెందు నడచిన నెముకలు, నేమివిన్న నార్త ధ్వనులు నయ్యెను.

అట్లున్న రంగస్థలమున మృత్యుదేవత విచ్చలవిడిగా సంచరించు చున్నట్లు, మహాభయంకరమై యుండెను. రాత్రి రెండు జాములకు సైనికులు శిబిరమునువిడిచి, పాఱిరి. రసపుత్రులు తెల్లవాఱు వఱకు నుండిరి.