పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

హేమలత

ముల ధరించి రసపుత్రుల నెదుర్కొన నుభయసైన్యములకును ఘోరయుద్ధం జరిగెను. ఆకస్మిక మహాయుద్ధములో మహమ్మదీయులు స్వసైన్య పరసైన్య భేదమెఱులుగఁ జాలక తమవారిని సహిత మా చీకటిలోఁ బొడిచికొనసాగిరి. ఈలోన సురక్షితముగ నగరముజేరి భీమసింగు మూలబలములనెల్ల దీసికొని దక్షిణ భాగమున మహమ్మదీయ సైన్యమును దాకెఁను. బలపడిన యీ సైన్యమునకును మ్లేచ్ఛులకును జరిగిన మహాయుద్ధము వర్ణింప దుస్సాధ్యమై యుండెను. తమ మాన ప్రాణములకు హాని తటస్థించునని శిబిరమందున్న స్త్రీ లాక్రందన ధ్వనిఁజేయ యుద్ధముమాని కొందఱు సైనికులు దారపుత్రాదుల సంరక్షణకై వెనకకు బరుగులిడుచుండిరి.

కొబ్బరి పుచ్చెలవలె దెబ్బ దెబ్బకు నెగిరిపడుచున్న మనుష్యుల పుర్రెలును స్రవించు రక్తముతో నేల గుభాలునఁబడు మొండెములును దళ తళ మెఱయు యోధుల యాయుధంబులును దక్క మఱేమియు నచ్చటఁ గనఁబడుటలేదు. రసపుత్రులును మహమ్మదీయులును హతులైన తన బంధుమిత్ర కళేబరములమీఁదనుండి నిర్దయాత్ములై నడిచిపోవుచు యుద్ధము నొనర్చుచుండిరి. పడినవారితోడను, పడెడువారితోడను, గాయములచే బాధపడి యేడ్చువారితోడను, దేహమును విడుచునెడ నీశ్వర స్మరణము జేయువారితోడను, వెన్నిచ్చి పరుగెత్తువారితోడను యుద్ధభూమి నిండి యుండెను.

ఈమధ్య మహాశూరుఁడగు ప్రతాపసింగు భీమసింగును విడిచి చక్రవర్తిని జెఱబెట్ట నుద్యమించి నాలుగువందల సైనికులను దోడుకొని యల్లాయుద్దీను గుడారముపై నరిగెను. చక్రవర్తిమీదికి రాజపుత్రులరుగుట