పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

101

నడచుచుండెను. మద్యపానమత్తులగుటచే బోయలు వడివడిగ నడవసాగిరి. రాత్రి జాముప్రొద్దు పోవునప్పటికి వారందరు ఢిల్లీనగరము బ్రవేశించిరి. నగర ముఖద్వారమును దాటి వారు నాలుగడుగులు సాగిపోవునప్పటికి దీపపు గ్రీనీడను గంబళమును గప్పుకొని కూరుచున్న యొకమనుష్యుడు బోయలం జూచి ఓరీ! యిటుయిటు అని మార్గమును జూపెను. అది యానవాలుగ బోయలు రాజవీధిని విడిచి సందుగొందులవెంట నడువసాగుట జూచి లాహిరి గంజాయిమత్తు పూర్ణముగ దిగినందున వడివడి ప్రక్కను నిలిచి చిత్తూరు వచ్చినాములే అమ్మా! యని హేమలతను లేపెను. మదనసింగు దర్శనమును లభించునని యూటలూరుచు నందు శయనించిన యీ బాలిక యా మాటవిని ప్రాణము లేచి రాగా దలుపులు దీసి వీధులఁ జూచుచుండెను. తరువాత గొన్నివీధుల, గడిచి బోయలొకసందులో నున్నత ప్రాకారములు గల యొక గృహముదగ్గరకు బోయి కంబళమును గప్పుకొన్న మనుష్యుడు నిలువుడని చెప్ప దామట నిల్చి పల్లకి దించిన తొడనే కంబళము గప్పుకొన్న సేవకుడు వచ్చి పల్లకి తలుపులను దెఱచి అమ్మా! స్త్రీలు కనిపెట్టుకొని యున్నారు. లేచి రమ్ము అనిపలికెను. లోపల స్త్రీ లొకదాసినయిన నేల యంపి తన్ను గౌరవింపరైరని హేమలత యోజించుచు మెల్లగ బల్లకి విడిచి లాహిరిని వెంటబెట్టుకొని తప్పటడుగులిడుచు లోనికి జనెను. ఆయింట హేమలత ప్రవేశించునప్పటికి నందు దీపమైనను లేదయ్యెను. ఈ మాయ యేమని మన హేమలత యోజించుచుండ నొకసేవకు డరుదెంచి లోపల స్త్రీలున్నారు. వారికి ఘోషాకలదు. మీలాహిరిని లోనికి దీసికొని రాకుము