పుట:Hatha Yoga Pradeepika.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

(సమాలోచనం)

ఈ ప్రపంచము శాశ్వతమా? అశాశ్వతమా? యని ప్రతివివేకియును ఆలోచించు చుండును. ఇట్టి యాలోచన తనకు గోచరించు వస్త్వాదులనుగూర్చి విమర్శించుటవలననే కలుగును. విమర్శనాజ్ఞానముచేతనే ప్రపంచముయొక్క మారుబతులును, మనుష్యులు మరణమునకు లోబడుతయును బోధమగును.

అవివేకులును వేదబాహ్యులును నాస్తికులును జన్మకారణమైన మరణమునే మోక్షమని తలంచెదరు.

వివేకవంతులు కేవలమరణమున కుత్సహింపక, పునరావర్తిరహితమైన మోక్షమును గోరి, దానికై భగవన్ముఖోద్గతములైన వేద వేదాన్తయోగ రహస్యములను పెద్దలవలనఁదెలిసికొని తద్ద్వార దుఖమయమైన యీ ప్రపంచమునుండి విముక్తులై నిత్యసుఖస్వరూపులగుటకు ప్రయత్నించెదరు.

ఇట్టి సచ్చిత్సుఖరూపమైన మహాపదవికి తానేవ్వ రను విమర్శమే మూలము. ఈ విమర్శమునకు దేహతత్త్వమూల వివేచనము ముఖ్యసాధకమై యున్నది.

ఇట్లు భాహ్యభ్యన్తర తత్త్వజ్ఞాన విమర్శనము వలననే చేతనతకుఁ దైనట్టి తనకును(జీవునకును) అచేతనమైనట్టి ప్రకృతికిని గల సంబంధము బోధమగును. ఈ సంబంధమునుండి తప్పించుకొన్న వాఁడే ముక్తు‍ఁడు. ఈ ముక్తిని బొందుటకు తత్త్వవిమర్శమును, ఆ తత్వవిమర్శమునకు జ్ఞానమును, జ్ఞానసిద్ధికి యోగమును పరస్పరకరనములై యున్నవి.

(మోక్షసాధనము.)

ఇట్టి పరమ పురుషార్థమైన మోక్షమును బొందుటకు రెండు విథములైన సాధనములు కలవు. వానియందు మొదటిది సాంఖ్యము. రెండవది యోగము. సాఖ్యము పుర్వాభ్యాసము గల ఉత్తమాదికారులకును, యోగము మధ్యమాధికారులకును సాధ్యముగా నుండును. యో మనఁగా చిత్త వృత్తులను నిరోధించుట. ఉత్తమాధికారులకు అభ్యాసవైరాగ్యమును; మధ్యమాధికారులకు అష్టాంగయోగమును ఆవశ్యకము లని పాతంజలయోగశాస్త్రమునందు చెప్పఁబడి యున్నది. అనఁగా, రాజయోగము చిత్తకలయనియు, ప్రాణ కలయనియు రెండు విధములు. యుక్తిచేతను, శాస్త్రోక్తమైన ఇంద్రియ నిగ్రహముచేతను, అసంప్రజ్ఞాత సమాధివఱకుఁగల మోక్షము నొందుట చిత్తకల. ఇట్టి లక్షణములు కలవాఁడు ఉత్తమాధికారి యనఁబడును. చిత్తము చాలించుట, విషయవాసన, ఉద్విగ్నము, సాధనసంపత్తిలేకుండుట ప్రాణకల. ఇట్టి లక్షణములు కలవాఁడు మందాధికారి యనఁబడును. ఇట్టి వానికి ప్రాణకలవలననే