పుట:Hatha Yoga Pradeepika.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

బ్రహ్మవిదారాశీర్వాదపద్ధతి.

మైన దైవీసంపద శుద్ధవాసన యనబడును. ఇది శుభవాసన యని పేర్కొనబడును. జ్ఞానరక్షసంశయ విపరీతాదులులేని, (అనగా బాధింపబడని రక్షితమైన) జ్ఞానము. దీనిని 29 వ వాక్యమునందు గనందగును. విస్తరముగా దెలియగోరువారు జీవన్ముక్తి వివేకము 4 వ ప్రకరణమున గనందగును.

తపస్సిద్ధి తపస్సు అనగా మనస్సుయొక్కయు ఇంద్రియములయొక్కయు, ఏకాగ్రయోగ బూమికలు, వీనియొక్కసిద్ధి యనబడును. తత్త్వజ్ఞానములకు ముందటివాడు భూమికలకును తపస్సుయొక్కస్దితి కలదనుటచేత, నిర్వికల్ప సమాధి స్వరూపమైన అయిదవ భూమికమొదలు మూడుభూమికలకును తపస్సిద్ధి కలదనుట స్వతస్సిద్దము. సర్వసమత్వము కలవాస్వరూపమును, నిందాస్వరూపమునైనవి సంవాదము లేకుండుట. దు:ఖనివేత్తి అవిద్యాది పంచక్లేశములు లేకుండుట.

సుఖావిర్భావము విజ్ఞానరక్ష మొదలగు సిద్ధులును తనకు గలిగియున్నను వానియందు తన కేవిధమైన సంబంధమును లేకుండుట.

 13.మైత్రీకరుణా ముదితోప్రేక్షేతి సద్వాసనాపాటవేన రాగాది దుర్వాసనాక్షయ: సయ్యగూబ్బయాత్.

తా.మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, అనెడి శుభవాసన యొక్క దృఢాభ్యాసమురాగాది మలినవాసనాశము చక్కగా గలుగును గాక.

మైత్రి సత్పురుషులయందు గల్గుస్నేహము
కరుణ దీనులయందుంగల దయ.
ముదిత సత్కార్యములు చేయువారియందు గల సంతొషము.
ఉపేక్ష దుర్మార్గులయందు తృణమువలె ప్రియా ప్రియులలేకుండుట.

  14. నిరన్తరాత్మాను సంధాసవశాన్మసోవృత్తి రూప పరిణామపరిత్యాగేన నిరుద్ధతాకారేణాత్మపరిణామో దృ

ఢీభూయాత్.

తా.సదా ఆత్మాను సంధానము చేయుటవలన, మనస్సునకు వృత్తిస్వరూపపరిణామము నివృత్తి యగుటచే నిరోదింపబడినట్టి స్దితిస్వరూపమైన.ఆత్మ పరిణామముధృడమగుగాక.

వృత్తి అనగా జ్ఞానము, ఇదిప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అని అయిదు విధములు దీనిని విస్తరముగా పాతంజల యోగశాస్త్రము 1 పారము 6-7-8 సూత్రములయందు గనందగును.

15.శమారిపూర్వక శ్రవణ మనన నిది ద్యాననాభ్యాస బలాద్విషయాసక్తి ప్రజ్ఞామాన్ధ్యం కుతర్కో విపర్యయదు రాగ్రహ శ్చేతి వర్తమానప్రతిబన్ద చతుష్టయ నివృత్తి ద్వారా అప్రతిబన్ద్వాం పరొక్షబ్రహ్మ సాక్షత్కారకారొ దృడీభూయాత్.