పుట:Haindava-Swarajyamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

హైందవ స్వరాజ్యము

పదునాఱవ ప్రకరణము.


పశుబలము.

చదువరి: ఇది నవీనసిద్ధాంతము. భయముమై యిచ్చినది మరల పుచ్చుకొందురా? ఒకపర్యాయమిచ్చినది ఎవరైనను. మరల్చుకొందురా.

సంపా: అటనవలదు. సిపాయిల తిరుగుబాటుకు తరువాత 1857 సంవత్సరపు వరదానపత్రము ప్రకటితమయ్యెను. శాంతి నెలకొల్పుటకుగా నీపని జరిగినది. శాంతినెలకొని ప్రజలు చల్లబడినపిదప ఆవరదానపువర్గము తగ్గినది. నేను దొంగనను కొందము. భయము కలదని తోచినప్పుడు దొంగిలించుట మానివేయుదును. ఆభయముతొలగెనా మరల నాపనిని ప్రారంభింతును. ఇది లోకస్వభావము. పశుబలము వినియోగించిననే ఏపనినైనను చేయించవచ్చునని తలంపుగొనినాము. కాబట్టి పశుబలము నుపయోగించుచున్నాము.

చదువరి: మీమాటలకు మీరే విఘాతము కలిగించుకొనుచున్నారే. ఇంగ్లీషువారు తమదేశములో సంపాదించినది పశుబలముచేతనే సంపాదించినారు. వారు గడించినది వ్యర్ధమని