పుట:Haindava-Swarajyamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇటలీ భారతభూములు.

87

ముగా అది నడుగునేని నేను వారికి తలవంచువాడ. ఏఇంగ్లీషు వాడైనను భారతభూమిలోని నిరంకుశత్వమును పోగొట్టి స్వాతంత్ర్యము సంపాదించుటకు తనజీవితమును ధారపోయునెడల అతనిని భారతపుత్రునివలెనే నే ప్రేమింతును.

ఇంతేకాదు. ఇటలీవలెపోరాడుట భారతభూమి ఆయుధములను ధరించినంగాని పొసగదు. మీరీవిషయము నాలోచించినట్లు, కానరాదు. ఇంగ్లీషువారు చక్కగా సాయుధులై యున్నవారు. దానికి నే జంకుటలేదు. కాని ఒక్కటిమాత్రము స్పష్టము. సాయుధులమై వారితో పెనగవలసినచో భారతపుత్రులలో వేలకొలది ఆయుధముల ధరింపవలసియుందురు. అది జరుగవలయుననిన ఎన్ని యేండ్లుపట్టునో ఆలోచించునది. అదిగాక భారతభూమిని విపులముగా సాయుధమొనర్చుటకు నర్థము మనము యూరోపునాగరకమున లయమగుట యగుచున్నది. అప్పుడు మనస్థితియు యూరోపుస్థితివలెనే కరుణాకరము కాక మానదు . ఈపరిణామమే మనము కోరునట్లైన ఆనాగరకమున చక్కగా శిక్షితులైనవారు మనదేశములోనుండుట అత్యావశ్యకమగుచున్నది. అప్పుడు కొన్ని కొన్ని హక్కులకై మనము పోరాడవచ్చును. కొన్ని సంపాదింపవచ్చును. కాలముగడుప వచ్చును. నిజమేమనగా భారతజాతి సాయుధముకాదు. అట్లు కాకుండుటయే మేలు.