పుట:Haindava-Swarajyamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాబట్టి అవి మనకు నిజముగా కరతలామలకము. ఈస్వరాజ్య ము కలపోలినదని యనుకొని ఊరక కూర్చొనుట పొసగదు. నేను చెప్పునట్టరూపముగల స్వరాజ్యమును ఒక్కవర్యాయము మనముసంపాదించిన యెడల అందరును దానిని సంపాదించునట్టు మనము ఎల్లప్పుడును ప్రోత్సహింపగలము. దాని స్వభావమే యిట్టిది. అయిస ఆస్వరాజ్యమును ఒక్కొక్కడును ఆత్మాను భవము చేత సంసాదింపవలసియున్నాడు. నీటమునిగి పోనుండు నాడు అడినే మరియొక నిని ఎప్పుడును తరింప జేయ లేడు. మనము దాసులుగా నున్నంతకాలము ఇతరుల దాస్యమును పోనాడుట కాలోచించుట వట్టిదంభము. ఈ కారణముల నాలో చించిన యెడల మనము ఇంగ్లీషువారిని వెడలగొట్టు నాదర్శము పెట్టుకొనుట అవసరమే కాదు. ఇంగ్లీషువారు భారతీయులగుదు రేని వారికిని ఇందు తావుగలదు. వారి నాగరకము నుంచుకొని వారిక్కడ నుండదలంతు లేనివారి కిక్కడ తావు లేదు. అట్టిపరి స్థితులను సృష్టించుశక్తి మనలో నున్నది.


చదువరి: ఇంగ్లీషు వారు భారతీయు లెన్నటికిని కాజాలరు.

సంపా: అట్లనరాదు. ఇంగ్లీషు వారిలో మానుషత్వము లేదన వచ్చునా ? వారు తమరీతిని మానుదురా లేదా యనుట ప్రస్తుత మున కవసరముకాదు, మన యిల్లు మనము చక్కగా పెట్టు గొనినయెడల అందులో నివసింపగలవా రే నివసింతురు.తక్కుం