పుట:Haindava-Swarajyamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80

హైందవ స్వరాజ్యము.


చదువరి: భారతనాగరకమే లోకములో నుత్తమమయిన యెడల భారత భూమికి దాస్య మెట్లు కలిగినది !.


చదువరి: ఈనాగరకము ఉత్తమమనుట నిర్వివాదాంశము. అయిన ఒక్కటి . గ్నాపకముంచుకొనవలెను. అన్ని నాగరకము లును వ్యవహారమున పరీక్షితము లగుచున్నవి. ఏది అచలమో అదియన్నిటిని గెలిచి స్థిరపడగలదు. హైందవ పుత్రులు చలించు టను జేసి భారత నాగరకము ఇక్కట్టుల బడిన ది. ఎన్ని మహాత రంగములు వచ్చినను కొట్టుకొనిపోవక నిలచుట చేతనే దీనిశ క్తి యిట్టిదని బయల్పడుచున్నది. అంతేకాక భారతభూమి యంత యుగూడ ఇంకను నీ వ్యవహార పరీక్షలోనికి రాలేదు. పాశ్చాత్యనా గరకము సోకినవారు మాత్రము దానికి దాసులైనారు.మానవు డెప్పుడును మహాప్రపంచమును తన జేనడే యని తలంచుట స్వ భావసిద్ధము.మనము దాసులైనప్పుడు లోకమంతయు దాస్యము నందినట్లే మనకు దోచును. మన మధోగతిలో నుండుటనుబట్టి భారతభూమి యంతయు అ దేగతిలో నున్నట్లుమనము తలపోయు చున్నాము. నిజమరయగా అట్టి స్థితి లేదు. పై సంగతులన్నియు మరువని యెడల మనము స్వతంత్రులమయిన యెడల భారతభూ మియు స్వతంత్రయగును. ఈ భావమే స్వరాజ్య శబ్దమునకు నిర్వ చనమును స్థాపించుచున్నది. మనలను మనము పరిపాలించుకొను యోగ్యత కలిగినప్పుడు మనకు స్వరాజ్యము తప్పక వచ్చినదే.