పుట:Haindava-Swarajyamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74

హైందవ స్వరాజ్యము.


మై నిలచియున్న ది. ఇవియే ప్రతిభ. భారత పుత్రులు ఏమాత్ర ము మార్పు చెందుటకును అంగీకరించరట. ఇది యజ్ఞానమట, మౌర్ఖ్యమట, భారతీయు లంత యనాగరకులట. ఈదోషారో పణ నిజముగా మన సుగుణమును ఖండించుట యయియున్నది. అనుభవముచే బాగుగా పరిశీలించి గడించిన దానిని నిజ మని యరింగిన దానిని మనము మార్చుటకు రాదు. భారత భూమి నెత్తిన నెంత సలహాలను క్రమ్మరించుట కెందరో ప్రయత్నిం చుచున్నారు. మనము వినుట లేదు. ఇందులో సార స్యమిది, ఇది యే మన యాశలన్నిటిని నెఱువేర్చగల యాధారము.


ఏమార్గము మాసవు నకు స్వధర్మోపదేశమును చేయునో అదియే నాగరకము. ధర్మనిర్వహణము, నైతిక ప్రవర్తనము ఇవి రెండును చాలమట్టుకు అభేదములు. 'నై తిక ప్రవర్తనముచే మనస్సును ఇంద్రియములను నిగ్రహింతుము. తన్మూలమున ఆత్మ స్వరూపము నెరుంగుదుము. నాగరకము అనుపదమునకు గుజరాతీ భాషలో నీతిప్రవర్తనము అను నర్థమిచ్చుపదము నుప యోగింతురు.


ఈ పదార్థము నిజమగు నేని అనేకులు గ్రంథకారులు వ్రాసి యుండు రీతిని వరులనుండి భారతభూమి నేర్చుకొనదగిన దేదియు లేదు. ఇది న్యాయమే కదా. మానసము నిలకడ లేని పక్షి. ఎంత అలవడిన నంత దీని కోరిక. నిరంతరమిది యసంతుష్టమే.