పుట:Haindava-Swarajyamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదిమూడవ ప్రకరణము.

నిజముగా నాగరకమన నేమి ?


చదువరి: మీరు రైళ్లను ఖండించితిరి. వకీళ్లను ఖండించితిరి. వైద్యులను ఖండించితిరి. యంత్ర సామగ్రినంతయు ఖండింతు రనుట నాకు స్పష్టము. అట్టయిన నిజముగా మీరు దేనిని నాగరక మందురో !


సంపా: ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరము కష్టము కాదు. భారత భూమి నిర్మించుకొని వచ్చి యుండు నాగరకము లోకమున మ రెక్కడను లేదు. మన పూర్వీకులు వైచినవి త్తనమును బోలు గట్టివి త్తన మింకెక్కడను దొరకదు. రోము గతించె, గీసుచనె. అసమానులు ఫేరోలు తరలిరి. జపానుపాశ్చ్యా త్య వేషమును ధరించె. చీనాను గురించి యేమియు చెప్పరాదు. అయిన భారత భూమిమాత్ర మెట్టెలో ఇంకను అస్తిభారము లలో చక్కగ నిలిచియున్నది. ఎన్నడో నాగరకమున నుం డిన గ్రీసు రోముల వద్ద నుండి యూరోపియను జాతులు పాఠ ములు చదువు కొనుచున్నారు. అట్లు నేర్చుకొనుటలో కూడ గ్రీసు రోముల లోపములను చూనుట తల పెట్టకున్నారు. ఇది జాలి కరమగు స్థితి. ఇంతటి మధ్యన భారత భూమి నిశ్చల