పుట:Haindava-Swarajyamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

భారత భూమిస్థితి : వైద్యులు.

.

నేనేదో తప్పుదారి తొక్కినాను. రుజ పై బడినది. వేద్యుడు బాగు చేయును. తరువాత సూటికి తొంబదితొమ్మిదిపాళ్లుమరల తప్పుదారి తొక్కు దుననుట నిశ్చయము. వైద్యుడు అడ్డ పడనిచో స్వభావానుగుణముముగ ఫలముక లిగియుండును. నేను సంరక్షించు కొనుశక్తి యలవడును, నాతప్పుదారి తప్పి యుండును, నాకు -సంతోషము కలిగియుండును.


ఆసుపత్రులు పాపమును పెంచునట్టి సంస్థలు. ఇవి కారణ ముగా మనుష్యులు తమశరీరములను గురించి తక్కున జాగ్రత్త గా నుందురు. కావున అవినీతి ప్రబలిపోవుచున్నది. ఐరోపి యను డాక్టరులు అధములు. డేహమును సంరక్షించు కొనుటను గురించి పొరపాటు అభిప్రాయము మనసులో నిడుకొని వీరు సంవత్సరము సంవత్సరము వేస వేలు జీవములను హింసించుచున్నారు. ఇది యే మతముకూడ అంగీకరించినది కాదు. మన దేహములను సంరక్షించుకొనుటకు ఇన్ని జంతువులను చంపనక్కర లేదని అందరును అంగీకరించుచునే యున్నారు.

ఈ డాక్టరులు మనమ తాభిమానమును చెడుపుచున్నారు వారి మందులలో ఎక్కువ వానియందు క్రొవ్వుగాని మత్తు ద్రనములు కాని కలియుచున్నవి. వీని రెంటిని హిందూమహమ్మ దీయమతములు రెండును నిషేధించినవి. నాగరకమను నాట కము మనమాడవచ్చును. నిషేధితములన్నియు మూఢవశ్వా