పుట:Haindava-Swarajyamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

దేశీయ మహాసభ : తదధికారులు.


త్నముమీద మనలనుద్బోధించి నదియు మనకు సంస్మరణీయమే. అట్లే సర్ విల్లియము వెడ్డర బరనుకూడ తన ధనమాన ప్రాణ ములను మనకొరకు వినియోగించినాడు. అతడు వ్రాసినవిషయ ములు నేటికిని సమాదరణీయము లై యున్నవి. గోకెలే పండితు డు మన హైందవజాతిని స్వరాజ్య మునకు సిద్ధము చేయుటకయి దారిద్య వ్రతమును పూని ఇరువది సంవత్సరముల కాలమును మన కై ధారపోసెను. దేశీయ మహాసభ మూలకముగా ఈ భూమిలో స్వరాజ్య బీజములను చల్లిన వారిలో కీర్తి శేషులైన న్యాయమూర్తి బద్రుద్దీను తయాబ్ది యొక్కడు. ఇ దేవిధముగా బంగాళములో, మద్రాసులో, పంజాబులో మరి యితర ప్రాంత ములలలో భారత భూమియంతటను హైందవ దేశమిత్రులును దేశీయసభాభిమానులును నైన హైందవులును ఆంగ్లేయులును నుందురు.


చదువరి: నిలుడు. - నిలుడు. మీరు కడుదూర మరుగుచు న్నారు. నా ప్రశ్నకును మీరిచ్చునుత్తరమునకును ఎక్కు డెడ మేర్పడుచున్నది; నేను మిమ్మునడిగినది స్వరాజ్యమునుగురించి. మీరు ప్రత్యుత్తరము చెప్పుచుండునది పరులపరిపాలనను గురించి. ఇంగ్లీషు పేర్లు నాకు విననక్కఱలేదు. మీరు వానిని చెప్పుచు న్నారు. ఇట్లుండుట చేత మీకు నాకు పొత్తుపొసగునని తో చదు. మీరు దయచేసి స్వరాజ్యము విషయము మాత్రము