పుట:Haindava-Swarajyamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము.

భారతభూమిస్థితి.

న్యాయవాదులు.


చదువరి: మీరనున దేమి? ఇరువురు పోట్లాడుకొనినప్పుడు వారు న్యాయస్థానమునకు పోరాదా! ఇది చిత్రముగానే యున్నది.


సంపా: మీరు చిత్రమున్నను మరియేమన్నను నేజెప్పినది నిజము. ఈ వేసిన ప్రశ్న వలన మనము న్యాయవాదులను గురించియు వైద్యులను గురించియు ముచ్చటింపవలసి యున్నది. నాయభిప్రాయమున న్యాయవాదులచే దేశము దాసత్వమంది నది. హిందూ మహమ్మదీయవి భేదములు 'పెరిగినవి. ఆంగ్లాధి కారము స్థిరపడినది.


చదువరి: ఈ నేరములుమోపుట సులభము కాని ఋజువు చేయుట మీతరముగాదు. న్యాయవాదులు కాకున్న మరి యెవ్వరు మనకు స్వాతంత్ర్యమార్గమును చూపియుండగలరు? బీదల నెవరు సంరక్షించి యుండగలరు? న్యాయము నెవరు స్థాపించియుండ గలరు : ఉదాహరణార్థము, గతించిన మన మోహన , ఘోసుగారు ప్రతిఫలముకోరక ఎందరనో బీదలను