పుట:Haindava-Swarajyamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

భారతభూమిస్థితి : రైళ్లు.

డాక్టరుల నడగినయెడిల క్షయరోగి కొక గుణము నహజమని చెప్పుదురు. చచ్చనప్పుడుకూడ అత డింకను బ్రతికి యున్నట్లే భావించుచుండునట ! క్షయ బయట స్ఫుటముగా కాన్పించురోగము కాదు. రోగిముఖమునకు దివ్యమగు కాంతి నిచ్చి ఆరోగ్య మనంతమను మోహమున పడ వేయును. నాగర కము ఇట్టిరోగమే. మనము బహుజాగ్రత్తగా నుండవలెను.


చదువరి: మంచిది. రైళ్లనుగురించి సెలవిండు.


సంపా: రైళ్లే లేకపోయినచో భారతభూమిని ఇంగ్లీష వారు ఇంతపూర్ణముగా వశమున నుంచుకొన లేరనుట మీకు విది తమేగదా ! రైళ్లవల్ల నేకదా బొబ్బల మారి వ్యాపించినది ! రైళ్లు లేనియెడల ప్రజలు గుంపుగుంపులుగా ప్రయాణములు చేయు టకు నీలు లేదు. మహామారి పురుగులను అవి మోసుకొని వచ్చుచున్నవి. పూర్వము సహజముగానే ప్రత్యేకత్వముండినది. రాకపోకలు సులువైనందున ఎక్కడ ప్రియముగా అమ్ముననిన అక్కడికి రైతులు ధాన్యము ఎగుమతి చేసి వేయుదురు. అందు చేత క్షామములు నిరంతరమయినవి. ఇది రైళ్లవలన కలిగిన స్థితియే. ప్రజలు అజాగరూకులయి క్షామభాధ హెచ్చైనది. రై ళ్లు మానవుని దుస్స్వభావమును పెంచినవి.దుష్టులైన వారు శీఘ్ర తరముగ తమయుద్దేశములను నెరవేర్చుకొనుటకు అవకాశము కలిగినది. భారతభూమి లోని పవిత్ర క్షేత్రములు అపవిత్రములయి