పుట:Haindava-Swarajyamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

భారతభూమి స్థితి.


చదువరి: అదెట్లనగలరు? మతము పేరు పెట్టుకొనియే హింవులు మహమ్మదీయులు యుద్ధములాడుకొనినారు.మతము పేరు పెట్టుకొని యే క్రైస్తవులలో క్రైస్తవులు ఒకరినొకరు సంహారము చేసికొనినారు. వేలకొలది నిరపరాధులు మతము పేరట నే కత్తివాతికి అగ్ని జ్వాలలకు చెప్ప రానిహింసలకు పాలయి నారు. ఏనాగరకముకంటెనుకూడ ఇది అసహ్యకరముకాదా.


సంపా: నాగరకము యొక్క కష్టములకంటె పైకష్టములు భరించుట సులభతరమని నాహృదయపూర్వక విజ్ఞాపనము.మత ము పేరు పెట్టి క్రౌర్యములు జరిపి యుండుట నిజమేయైనను ఎవ్వ రును ఈ క్రౌర్యములు మతమున కంగములని యెప్పుడును చెప్పి యుండ లేదు. కాబట్టి ఈ క్రౌర్యములు మనతో సంపూర్తియగు చున్న వేకాని వెనుకటికి బీజములను చల్లిపోవుట లేదు. మూఢ విశ్వాసులును నజ్ఞానులు నైన ప్రజలున్నంత కాలము ఇట్టి క్రౌర్య ములు జరుగవచ్చును. కాని నాగరక జ్వాలల క్రింద లీనమగు నట్టి దురదృష్టుల సంఖ్యకు మితియను మాటయే లేదు. నాగరక మున నుండునట్టి పరమనీచగుణ మేమందురా? మాసపులు దాని నే మోమహా ప్రసాదమనుకొని ఆ కార్చిచ్చు నురుకు చుండు టయే. అందుపడిన వారు దుర్మతము పాలయి లోక ఫల మేనూ త్ర మును అనుభవింపజాలని వారగుచున్నారు. నాగరకము తేనె పూసినక త్తిషంటిది. దానిపూర్ణఫలముబయల్పడినప్పుడు నవ