పుట:Haindava-Swarajyamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతభూమి ఏల నష్టమైనది.

39


వ్యాపార పాశము పనికి రానందున కీర్తి శేషుడు గ్లాడుస్టను ఇంగ్లీ షువారాప్రాంతమును తమవశమున నుంచుకొనుట సరి కాదని నిశ్చయించెను. అయిన అదే ప్రాంతము లాభకారి యయిన ప్పుడు సంఘర్షణ కలిగి యుద్ధము పొసగెను.వెంటనే ట్రాన్సు వాలు పై ఇంగ్లండుకు సార్వభౌమత్వాధికారము కలదని ఛేంబ ర్లేనుగారు కని పెట్టిరి. ఒక చిన్న కథ చెప్పుదురు.. అధ్యక్షుడు క్రూజరు బ్రతికియుండగా నెవరో అతనిని ' చంద్రునిలో బంగా కమున్నదా ' యని అడిగిరట. ' చాలమట్టుకు లేదు. ఉన్న యెడల ఇంగ్లీషువా రెన్నడో దానిని స్వాధీనపరచుకొనియుం దురు ' అని అతడు బదులు చెప్పెనట ! వారికి ధనము దైవమ నుట జ్ఞాపక ముంచు కొను నెడల ఎన్ని చిక్కులనో అర్థము చేసి కొనవచ్చును. అంతయు చూడగా ఇంగ్లీషు వారిని మన స్వోప యోగార్థము మనమిక్కడ ఉంచుకొనుచున్నా మనుట తేలుచు న్నది. వారివ్యాపారము మనకు కావలెను. వారి చాక చక్య పద్ధతులచేత వారు మనలను తృప్తిపరచుచున్నారు. వారికి కావలసినది అందుమూలకముగా సంపాదించుకొనుచున్నారు. వాని ఇందుకుగాను దూషించుట వారిశక్తిని ఇనుమడింప జే యుటతప్ప వేరుకాదు.మనలో మనము పోట్లాడుకొని వారి శక్తిని బలవత్తరము చేయుచున్నాము. పై చెప్పిన సంగతులన్ని యు అంగీక రించు నెడల ఇంగ్లీషువారు వ్యాపారమున కై యిక్క .