పుట:Haindava-Swarajyamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.


భారతభూమి ఏల నష్టమైనది?


చదువరి : నాగరకమునుగురించి మీరు పుష్కలముగా వివరించినారు. నేను విమర్శించుకొనుటకు చాలినంత చెప్పినారు. యూరపుజాతులనుండి మన మేమిగ్రహింపన లెనో యేమిత్య జింపవ లెనో నేను నిశ్చయముగా తెలిసికొన లేకున్నాను. ఒక్క- ప్రశ్నమాత్రము నా పెదవుల నానియున్నది. నాగరిక మే రోగ మైన, ఇంగ్లండు ఆరోగమునకు లోబడియున్న, భారతభూమి ఇంగ్లండుపక్ష మెట్లెయున్నది. ఇంకను నావశమున నెట్టు నిలచినది?


సంసా : మీప్రశ్నకు ఉత్తరము చెప్పుట మిక్కిలికష్టము "కాదు. త్వరలోనే నిజమైన స్వరాజ్యత త్త్వముకూడ విమర్శింప నగును. ఇది యేల మధ్యమున చొప్పించితిరందురా నే నింకను ఆప్రశ్నకు జనాబియ్యవలసియున్నందున నేయగును. ముందు 'మీ వెనుకటి ప్రశ్నకు ప్రత్యుత్తరమి చ్చెద. ఇంగ్లీషు వారు భారత భూమిని తీసికొన లేదు; మనము వారికిచ్చి నాము. బలము ఉండబట్టి వారిక్కడ లేరు. వారిని మనము పెట్టుకు న్నాము. కాబట్టి వారిక్కడనున్నారు. ఈవిషయములు