పుట:Haindava-Swarajyamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

నాగరకము.


ఉద్దీపకము లేదను ఓ శిశువునకుగూడ అర్థము కాక పోదు. నాగ రకము భౌతిక సౌఖ్యములను పెంచుటకు ప్రయత్నించుచున్నది. ఆ ప్రయత్నమునందును అది యేమాత్రము ఫలసిద్ధి పొందుట లేదు.


ఈ నాగరకము దుర్మతము. దీని ప్రభావము వర్ణనాతీతము.. యూరపులో దీనికి లోబడినవార నేకులు వెఱి వారికి తుల్యు లుగా నున్నారు. వారికి ఋజు బలము కాని సహజ ధైర్యము కాని లేదు. త్రాగుడు వలన వారిశక్తిని నిలువ బెట్టుకొనుచున్నారు, ఒంటరిగా నుందురేని వారికి జీవన మే దుర్భర మగును. గృహాణి దేవతలుగా, నుండదగిన స్త్రీలు వీధులలో నల్లాడుచుందురు. లేదా, కర్మాగారములలో ముగ్గుచుందురు. గంజికిగాను ఇంగ్ల డులో ఐదులక్షుల స్త్రీలు కర్మాగారములలోను మరియితర సంస్థ లలోను మహానరక పరిస్థితులలో కుందుచు పని చేయుచున్నారు. స్త్రీ స్వాతంత్ర్య వాదము దినదినము బలపడుట కీ గొప్పదురానస్థ యొక కారణము,


ఈనాగరకము దానంతట తానె నశింపగలదు. మనము ఓపిక మాత్రము పట్టియుండవలెను. మహమ్మదు బోధ ననుసరించిన యెడల ఈనాగమును సైతాను నాగరకమనవ లెను. హిం దూమతము దీనిని కలియుగమనుచున్నది. దీని పూర్ణరూప మిట్టిదని మీకెరింప లేను ఇంగ్లీషుజాతి నిదిపట్టి వారి కండ