పుట:Haindava-Swarajyamu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
324

హరిశ్చంద్రోపాఖ్యానము

బెనుపొంద మున్ను సెప్పిన మార్గమునను
సత్యసంధుఁడు హరిశ్చంద్రునిచరిత
నిత్యసత్కీర్తులు నెగడ రచించె3010
భ్రమరాప్రసాదసంప్రాప్తకవిత్వ
సుమహితసామ్రాజ్యసుఖపరాయణుఁడు[1]
చతురసామాన్యలక్షణచక్రవర్తి
ప్రతివాదిమదగజపంచాననుండు[2]
మతిమంతుఁ డయ్యలమంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు
కవు లెన్న నుత్తరకథ రచియించె
నెవరు పఠించిన నెవ్వరు విన్న
జనులకుఁ బుణ్యముల్ సమకూడు సిరులు
మునుముగా నాయుష్యములు గొన సాగుఁ
దాముఁ బుత్రులు నన్నదమ్ములు సఖులు
దామరతంపరై ధరణిఁ బెక్కేండ్లు
వేమాఱు నోములు వెలయఁ బెండ్లిండ్లు.
సేమ మేర్పడ నెందుఁ జేయుచుండుదురు.

హరిశ్చంద్రోపాఖ్యానము

సమాప్తము

  1. ...పరాయణుడు = భ్రమరాంబికయొక్క యనుగ్రహము వలనఁ గలిగినకవిత్వమనెడి మిక్కిలి గొప్పసామ్రాజ్యమునందలి సుఖము నందు నిష్ఠుఁడైనవాఁడు
  2. ప్రతివాదిమదగజపంచాననుండు = ప్రతివాదులనెడి మదపుటేనుఁగులకు సింగ మైనవాడు.