పుట:Haindava-Swarajyamu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
322

హరిశ్చంద్రోపాఖ్యానము

వందిమాగధజయధ్వను లుల్లసిల్ల
నెదురుగా నేఁగి యయ్యినకు లేశ్వరుని
పదపంకజములకు భ క్తితో మ్రొక్కి
యొనరఁ జేతులు మాడ్చి 'యో హరిశ్చంద్ర
దీనకరవంశప్రవీపక నీకుఁ
బ్రతి సేసి కొనియాడ రాజులు గలరె
సతతసత్యవ్రతాచార సంపదల.................................2970
దొడరి వసిష్ఠునితో రాయిడించి
తడయక తన ఘోరతపము పెంపునను
బడయ దుర్లభ మైన బ్రహ్మఋషిత్వ
మడరంగఁ గైకొని యఖిలలోకములు
బొగ డొందు కౌశికముని వెఱగంద
నెగడించి మించితి నీ సత్యమహిమ
వసుమతీవల్లభ వన్నె రెట్టించే
నెగడె నీకతమున నీవంశ మెల్ల
సన్ను తం బై ననీసామ్రాజ్య లక్ష్మి
బన్ను గాఁ గైకొని ప్రజలం బాలింప ...............................2980
విచ్చేయుఁ డిఁక ' నని విన్న వించుటయు
నచ్చుగా దరహాస మల్లన యొలయ
సమయోచిత ప్రియసంభాషణములు
గొమరార మంత్రిముఖ్యుని నాదరించి
సన్నుత కాంచనాచలమును బోలె

...........................................................................................

నిలిపి మిక్కిలి ధగధగ ప్రకాశించునట్లుగా నసుట, తేజీలు= గుఱ్ఱములు, ప్రతి సేసి=సాటి చెప్పి, రాయిడించి =మార్కొని-కలహించి, కాంచనాచలము = బంగా 2