పుట:Haindava-Swarajyamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

315

మరి మీద దేవేంద్రుమా ఱటగద్దె
నెరి నెంత గాలంబు నిలుపుదు నంటి
నంతగాలము నుండు మమరలోకమున
వింతగా దీమాట వి శ్వేశునాన
నావుడు నొం డాడ నలికి భూనాథుఁ................................2820
‘డే వెంట నేదోష మెసఁగునో' యనుచుఁ
జింతింపు చున్నంత శిష్యులు గొలువ
సంతోషచిత్తుఁ డై చయ్యన వచ్చి
తన తేజ మెల్లెడఁ దనర వసిష్ఠు
డనుపమభక్తి భర్గాది దేవతలఁ
గని మొక్కి ప్రస్తుతిఁ గావించి యప్పు
డినకులాధీశుని నీక్షింప నృప్పుడు
మ్రొక్కి చేతులు మోడ్చి మునినాథ నీవు
మిక్కిలిక రుణ నామీఁదఁ గావించి
తొడిఁబడఁ బరుసంబుతో నిన్ము సోఁకి...........................2830
కడువడి మేల్మి బంగార మైనట్టు
లీతని నన్ను బరీక్షింపఁజేసి
ఖ్యాతి నొందించితి గాదె నీ విపుడు
ఘనతపోధనుఁ డై నగాధేయుతలఁపు
మనమున నెఱిఁగి సమతిఁ బ్రోవ నిందు
వచ్చితి గాన జీవము వచ్చె నాకు

............................................................................................................


మాఱటగ ద్దె= ప్రతియైన సింహాసనమండు, పరుసంబునిమ్మ సోఁకి ... బంగార రమైనట్లు= స్పర్శ సేదితో నినుముతగిలి మంచి బం గారయినవిధమున, ఇచట స్పర్శ వే దికి విశ్వామిత్రుఁడును, ఇనుమునకు హరిశ్చంద్రుఁడును ఉప మేయములు ,