పుట:Haindava-Swarajyamu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
314

హరిశ్చంద్రోపాఖ్యానము

బొలుపొందఁ దా దార పోసినదైన
సూది మోపెడునంత చోటు నాభూమి
లే దని కడపిన లెక్కింప వాఁడు
ఘనతర మగునరకమున వేయేండ్లు
మునుఁగుచుఁ గ్రిమిరూపమున వసియించు,
ననుధర్మశాస్త్రవాక్యార్థంబు గొంత...............................2800
మనమునఁ దలపోయుమా మునినాథ
యే కాతపత్రమై యెసఁగునీవసుధ
నీకిష్టమగువారి నిలిపి యేలింపు'
మనుటయు “మే లయ్యె నట్లచేసెదను
జననాథ నాకు నీసకలరాజ్యంబు
నీచేత నేలింప నిక్కంబు వేడ్క
నా చిత్తమునఁ జాల ననిచిన దిపుడు
బొంకితి నని పొమ్ము పో కున్న వట్టి
శంకలు మాని నాజాడ నే రము
దేవేంద్రుఁ డాదిగా దేవసంఘములు.........................2810
నావామదేవా దులైనసనుమ్మనులు
సెవులార విన మున్ను సేసిన ప్రతిన
శివశివ తప్పునే చెచ్చెర నిన్ను
నిల నెంత గాలంబు నేలింతు ననుచుఁ
బలికితి నందాఁకఁ బాలింపు వసుధ

...................................................................................................................

ధారపోసినట్టి గాని భూమిలో సూది మో పెడునంతామాత్రము భాగము ఇయ్య లేదని చెప్పి జరపి పుచ్చినయెడల, ఏకాతపత్రము= ఏకచ్ఛత్రము, ననిచినది= పుట్టి నది, బొంకితినని పొమ్ము = అబద్ధము చెప్పితినని చెప్పి తప్పించుకొని పొమ్మ, పోకు న్న...రమ్మ = అట్లు చెప్పిపోనియెడల నా వెంట నే వచ్చి "నాపంపు సేయుము,