పుట:Haindava-Swarajyamu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

313

ద్వితీయ భాగము.

నలఁకువఁ బొందించి నాతిని నిన్ను
వేవేల విధముల వెతలఁ గుందించి
కావరంబునఁ జాలఁ గల్ల చేసితిని
లోలత నా తప్పు లోఁగొని మనసు
జాలిఁ బో విడిచి యీసామ్రాజ్యలక్ష్మి
నెమ్మదిఁ గైకొని నెరి మహీ ప్రజల
నిముల రక్షింపు మిఁక ' నన్న నవ్వి
‘యకట మునీంద్రయిట్లానతీఁ దగునె............................2780
సక లజగన్నుత చరితుండ వీవు
నీ కేటి తప్పులు నిఖిలలోకముల
నీకతంబున మించె -నేఁడు నా కీర్తి
ఘన మైననీయనుగ్రహమునఁ గాదె
చనుదెంచె ననుఁ బ్రోవఁ జం ద్రావతంసుఁ
డీ దేవతలు మును లీయోగివరులు
యఁ గాదె మన్నించిరి నన్ను
జల్లనినీక టాక్షంబు నామీఁద
నుల్లంబులో మోద ముప్పొంగఁ జేసె
బరి తాపములనెల్ల బాపె సౌఖ్యములఁ.......................2790
బురికొల్పె నింక నోమునిచంద్ర నిన్ను
వెఱచుచు నొకమాట వేఁడెద నేను
మఱచియు రాజ్యంబు మళ్లి కొమ్మనకు
మెలమితో ము న్నొక్కఁ డిచ్చినదైన

............................................................................................................

నలఁకువ= ఒరిపిడి, నాతిని= స్త్రీని నీ భార్యయైన చంద్రమతిని, చంద్రావతంసుఁ డు= శివుఁడు,మున్నొక్కఁడు... కడపినన్ = ఒకడు ముందు దానిచ్చినట్టి గాని