పుట:Haindava-Swarajyamu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

311

ద్వితీయ భాగము.

తళుకులు మెజయునద్దంపుఁ జెక్కిళ్ల
దళుకు దళుక్కని తఱుచుగా మెఱయఁ
గదలుబంగారుచిల్కల రావి రేక
పొదలి నెన్నుదుట సొంపుగ నటియింప
గోమేధిక పుఁబులిగోరు నేవళము
ప్రేమమై యురమునఁ బెనఁచి తూఁగాడఁ
బరఁగ నుంగరముల పచ్చనిడాలు................................2740
బెరసి ముద్దుల వేళఁ బెనఁగ నే తెంచు
సుతు లోహితాస్యునిఁ జూడ నాచంద్ర
మతికిఁ జన్ను లు సేఁపె మమత నాయింతి
యానంద బాష్పంబు లందంద రాల
గా నక్కుతో నొ త్తి కౌగిటఁ జేర్చి
ముద్దాడుచుండ నప్పుడు కౌశికుండు
తద్దయు లజ్జించి తలవంచు కొనుచుఁ
గడుఁ జిన్న బోయి యాగ్రహ మెల్ల బోవ
విడిచి శంకించుచు వెఱఁగున మునిగి
'తపమనుదనమూలధనము ప్రతిజ్ఞ........................2750
నెపమునఁ జెడిపోయె నేఁడు నాకకట
పాక శాసనుఁ డేల ప్రశ్న గావించె
నాక్రియ మును లెల్ల న ట్లూరకుండఁ
బారెడిబండ్లకుఁ బదములు సాఁచు

...........................................................................................................

ళము= హారము, ఉరమునన్ పెనఁచి= బొమునందుగలుకొని, తపమను తనమూ లఢనము=మూలధనమువలె సంతరించిన తనతపస్సు, పారెడి... వీరిడిపగిది=ప రు గెత్తుచున్న బండ్లను పోనీయకుండ నిలుప నెంచి తన కాళ్లడ్డము గాఁజాఫి తు