పుట:Haindava-Swarajyamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
306

హరిశ్చంద్రోపాఖ్యానము

భూవర' యనిన నద్భుతముఁ దత్తఱము
భయము సంభ్రమమును భక్తియు నయముఁ
బ్రియమును బెనఁగొనఁ బెల్లుగా మేనఁ
బులకలు గొబ్బునం బొడమ నానంద
కలితాశ్రుకణములు గన్ను లఁ దొరుఁగ
నవనిఁ జాఁగిలి మొక్కి యడుగుల కెరఁగి
సవినయంబునఁ గిరజలజముల్ మొగిచి
“కాలకంధర లయకాలాగ్ని రుద్ర...........................................2650
కాలసంహర మహాకాళీనివాస
వాసు దేవ ప్రియ వాసుకివలయ
వాసవార్చిత కృత్తివాస మహేశ
నాగశోభితహ స్త నాగాసురారి
నాగ నాగాంతక నాగేంద్రవంద్య
కమలాసనస్తుత్య కమలా పనేత్ర
కమలారి సురసరిత మలక పర్థి

................................................................................................................

నెడి కలువలకు, సైఁచుభూవర = తాళురాజూ, కాలకంధర =నల్లని కంఠముగల వాఁ డా లయ....రుద్ర= ప్రళయకాలాగ్నివల్లెరౌద్రుఁడైనవాఁడా, కాలసంహర = యముని నిగ్రహించిన వాఁడా, మహా కాళీనివాస= పార్వతి కాటపట్టయిన వా డా, వాసు దేవ ప్రియ విష్ణువునకు ప్రియుఁ డైన వాఁడా, వాసుకివలయ = వాసుకి కడియము గాఁగలవాఁడా, వాసవార్చిత = ఇంద్రుని చేత బూజింపబడినవాఁ నాగశోభితహస్త = జింక తోలు చేనొప్పుచున్న చేయిగలవాఁడా, నా'గాసురారి =గజాసురునకు శత్రువైనవాఁడా, నాగ నాగాంతక = గజాసురాంత క, నాగేంద్రవంద్య = ఆది శేషునికి వందింపఁదగిన వాఁడా, కమలాసనస్తుత్య -- బ్రహ్మకు స్తోత్రము సేయఁదగిన వాఁడా, కమలా ప్త నేత్ర = సూర్యుఁడు కన్ను గాఁ గలవాఁడా, కమలా... కపర్ది = చంద్రుఁడు గంగానది తామరలునుగల జ