పుట:Haindava-Swarajyamu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

305

ద్వితీయ భాగము.

వెస ఖణీల్లున జంకె వేసి కుప్పించు
బసవరాయని నెక్కి పార్శ్వభాగమున
బాలును నీరు నేర్పఱచువాహనపు
వేలుపు డగ్గఱి వింజామ రిడఁగఁ
దివిరి నెమ్మది దూర్పు దెస నేలు రాజు
ధవళాతపత్రంబు ధరియించి నడువ
ముట్టి వేల్పులఁ గొట్టి మొనసిన బిరుదు.............................2630
పట్టెంబువీరుండు పడవాలు గాఁగఁ
గిన్న రగంధర్వగీర్వాణయకు
పన్న గవరులును బ్రమథులుఁ గొలువ
శుక కుంభసంభవ సుబల కణ్వాది
సక లసన్మునిగణసంస్తుతు లెసఁగ
ననుపమభూతిలిపావదా తాంగ
జనిత నిర్మల కాంతిచంద్రిక వలన
నయ మార నఖిలవిజ్ఞానివిశాల
నయనోత్పలముల కానంద మేసంగఁ
బరమయోగీంద్రులు భావంబునందుఁ.................................2640
బరికించి కాననిపరమాత్మ మూర్తి
యావేళఁ దనకుఁ బ్రత్యక్షమై 'సై చు

.................................................................................................

త్రిశూలము, బసవరాయని వృషభ రాజును - నందిని, పాలు ...ను వేలుపు హంసవాహనుఁడైన బ్రహ్మ, తూర్పు దేస నేలు రాజు ఇంద్రు డు. బిరుదు పట్టెంబు వీరుఁడు = గొప్ప కత్తిని దాల్చిన వీరుఁడైన కుమా రుఁడు, పడవాలు= సేనాపతి, అనుపమ ... చంద్రిక వలన = సాటి లేని బూదిచే పూయఁబడిన తెల్లని యవయవములవలనఁ బుట్టిన యచ్చమైన కాంతియ నెడు వెన్నె లవలన, అఖిల ...త్పలములకున్ = సమ స్తజ్ఞానుల విశాలము లైన నేత్రములు