పుట:Haindava-Swarajyamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
304

హరిశ్చంద్రోపాఖ్యానము

డీరీతి కౌశికునింద్రజాలంబొ
వాతప్పితినొచేతివడి దప్పి చనెనొ
చూత మీతోయ మీచోద్య మిలీల
నసి వోవ వచ్చు నాయసి వొక' యనుచు
వెసఁ బూన్చి మఱియును వేయఁ జూచుటయు
శ్రీవిశ్వనాథుఁ డాశ్రిత పారిజాతుఁ ........................................2610
డా వేళఁ గరుణ నిండారుచిత్తమున
వడి గొని మూడుత్రోవలఁ బాఱు నేఱు
తొడరి కెంజెడలలోఁ దుంపురుల్ గురియఁ
జెన్నుగా నౌదలఁ జేరినమించు
"క్రొన్నెలతళ్కు చకోరాళిఁ బిలువ
నుఱక పువ్వులవిల్తు నొక జుఱ్ఱఁ గొన్న
చుఱుకుచూపులకన్ను చోద్య మై మేఱయ
దనర నేనుఁగుమోముతనయునిఁ గన్న
వనజాక్షి దాపలివంక శోభిల్ల
మేలి మువ్వన్నెలమెకము మైతోలు.....................................2620
చేల గట్టిన కాసెచెఱఁగు దూలాడఁ
బోఁడిగా మెఱుఁగుల పోల్కి దీపించు
మూఁడుముల్కులవాలు ముష్టి చే నమర

....................................................................................................

వవచ్చు నాయసిపోక = నాక త్తి పాటు వ్యర్థము కావచ్చునా, మూడుత్రోపలఁ బారు నేఱు త్రిపథగ -గంగ , మంచుకొన్నె లతళ్కు = ప్రకాశము గల్యత చందురుని రేక , ఒక జుర్రున్ = ఒక్క పీల్పు గా, చుఱుకుచూపుల కన్ను = ఆ గ్ని నేత్రము, ఏనుఁగుమోము తనయుని గన్న వనజాక్షి = విఘ్నేశ్వరునిఁ గన్న ట్టి పార్వతి, దాపలివంకన్ ఎడమ ప్రక్క, మేలి మువ్వన్నెల మెకము మై తోలు డేల = మే లైన జింక మేనితో ల నెడి వస్త్రము, మూడు ముల్కులవా