పుట:Haindava-Swarajyamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

303

ద్వితీయ భాగము.

నావుడు వెఱఁగంది నరలోక నాధు
పావన సత్యసంపద 'కాత్మ నలరి
బొంకించునాసలఁ బో వీడి మౌని
పొంకంబు చెడి తలపోయుచు నుండె
నప్పుడు దేవత లంబరవీధి.................................................2590
నుప్పొంగు వేడ్కల నువిదలుఁ దారు
బహురత్నదీప్తుల భాసిలుచున్న
మహనీయదివ్యవిమానంబు లెక్కి
వెఱఁగంది క్రందుగా వీక్షించుచుండ
నెఱ దెంపుమై ధారుణీత లేశ్వరుఁడు
భిదురంబుకంటెను బెడిద మై చదల
నదరులు సెదర భయంకరలీల
వాలువా లెత్తి యా వొమాక్షికంఠ
నాళంబు తెగ వేయ నది కఱుక్కనఁగఁ
దాఁకిన వేటు పూ దండయై చెన్ను......................................2600
గైకొని పూబోఁడిగళమున నున్న
దల యూచి సతిఁ జూచి తన కేలునె త్తి
ధళధళ మనుఖడ్గధార వీడ్కించి
'దాటి దప్పెనొ కాక ధవళాక్షి కిప్పు

.....................................................................................................................

కందు గాన్ =గుంపులుగొని, భిమురంబు కం టెను= వజ్రాయుధముకంటెను, బె ద మై= భయంకరమై, చదల = ఆ కాశమునందు, అదరులు: మీడుంగుఱులు, వాలు వాలు= అతిశయించుచున్న క త్తి, కంఠ నాళంబు = గొంతుక్రోవి, కలుక్క గళగ... దండయైక = కఱుక్కని తగిలిన దెబ్బ పూదండ గా మారినదై, చెన్ను గై కొని= అందమునొంది, గళమునన్ = మెడయందు, ఈతోయము= ఈసారి, అసినో