పుట:Haindava-Swarajyamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
302

హరిశ్చంద్రోపాఖ్యానము

బెక్కుచందములఁ బ్రియమును భయము
నెక్క బోధించుమునీంద్రునిఁ జూచి
పక పక నవ్వి 'యీభవసాగరంబు
నొకదరిఁ జేర్చుచు నున్నాఁడు శివుఁడె
యితరునివలె నది యిది యని కాని.........................2570
గతులు నీచేతఁ దార్కాణింపఁబడెడు
రాసి నీ కెదు రుత్తరంబులు వల్క
నాసరోజాకుండు నలుకు నేనెంత
మును నీవు చెప్పిన బుద్ధులె కాక
వినఁ క్రొత్త లేడివి వివరించి చూడ
వీర బాహునిమది విశ్వాస మొదవ
గోరి నేఁ జేసిన ఘోర ప్రతిజ్ఞ
మఱచి సత్యము మట్టుపఱిచి లోలోన
జరిగి పోనిత్తున స్వామికార్యంబు
సుతు నొల్ల సతి నొల్ల సురలోక మొల్ల
బతిమాలి నీ విచ్చు పడతుల నొల్ల
సత్యంబు గలిగినఁ జాలు వేయేల
సత్యమే జయ మని చాటు వేదములు
విడువు ఖడ్గం బింక వేంచేయు మిట్టి
యెడ నుండఁ జనదు మునీశ నీ వింక'

.................................................................................................................

సముద్రము యొక్క, ఒక దరిన్ = ఒక గట్టును, ఇతరునివ లె= సామాన్యుఁ డైన యొక నివలే, ఇది యదియని కానిగతులు నీ చేతఁ దార్కాణింపఁబడెడు = ఇదిమంచిది అవి చెడ్డది యని సరి కానట్టి పద్ధతులు నీవు సూచించుచున్నావు, రాసిన్ = తెగు వతో, సరోజాక్షుడు=విష్ణువు, పొంకంబు చెడి = పసగుంది, ఉవిదలు= స్త్రీలు,