పుట:Haindava-Swarajyamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

299

నున్నంత బంధంబు లూడ్చి పో వైచి....................2510
యన్న రేంద్రుఁడు జగ దాశ్చర్య మెసఁగు
బహుసరిత్సాగర పర్వతద్వీప
మహితమహామహీమండలభార
మురుతరలీలఁ గేయూర విభాతి
భరియించునపసవ్య బాహుదండమున
సకలవిరోధి రాజన్యకోటీర
నికరకీలిత మణినికషణదీ ప్త
శాత ధారాభీల చటులఖడ్గంబు
భూతముల్ భీతిల్ల ముష్టి నమర్చి
చండమార్తాండదుస్సహదుర్నిరీక్ష..............................2620
మండల ప్రభలతో మార్కొని మండు
మెఱుఁగు లుగ్రంబుగా మిన్నులఁ బర్వ
నొర వాయఁ బెటికి మహోగ్రతఁ బూని

..........................................................................................................

ములు= ప్రేమాద్యను బంధములు, ఊడ్చిపో వై చి =-బొత్తి గాఁ దొలఁగించుకొని, బహు భారము- బహు=అనేకము లైన, సరిత్ =నదుల చేతను, సాగర= నము ద్రముల చేతను, పర్వత= కొండల చేతను, ద్వీప = ద్వీపముల చేతను, మహిత = పెద్ద దైన, మహామహీ మండలభారము = గొప్ప భూమండలము యొక్క బరువు, కే యూరవిభాతి= బాహుపురి లీలగా, భరియించు= తాల్చునట్టి, అపసవ్య బాహు దండమునన్ = దక్షిణ భుజదండమునందు, సకల... ఖడ్గంబు= సమస్త శత్రు రాజుల బాహు పురుల సమూహములందు పొదుఁగంబడిన రత్నములతో నొఱ పెట్టుటవలన మెఱుఁ గెక్కిన వాఁడివాదర చే భయంకర మైన పెనుగత్తి, చండ ... ప్రభలతో = ప్రచండమైన సూర్యునియొక్క సహింపశక్యము కానట్టియుఁదేరి చూడగానట్టియు బింబము యొక్క కాంతులతో , మార్కొని ఎదిరించి, మండు