పుట:Haindava-Swarajyamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

297

ద్వితీయ భాగము.

వినుతధర్మంబులు వేరొండు గలవె
మున్ను స్వామిద్రోహి మోవ లే ననుచుఁ
బన్న గతల్పుతోఁ బలి కె భూదేవి
తన్ను మోచినచోటఁ దగ వట్టె పెట్టి
మిన్నక సురిఁగిన మెత్తురే జనులు
నీ పురీశ్వరుఁడు ని న్నేలినసామి
యీపని విధియించె నిది గాక నాకు
రూఢిగా రాకుమారునిఁ జంపె ననెడి..........................2480
యాడిక తలగూడె యభిమాన మెడ లె
నటు గాన ననుఁ జంప నర్హ మీ వేళ
కటకటా నీవేల కరుణఁ దాల్చెదవు
తక్కిననీచవర్తనులచేఁ జావ
కిక్కడ నాజీవి తేశుఁడ వైన
నీ చరణంబులు నెమ్మితోఁ గొల్చి
నీచేత మృతిఁ బొంది నీ పొందు మీఁద
నే పొందఁగాఁ గంటి నెట్టి సౌఖ్యంబు
లీపొందు రా వింక వెడ సేయ నేల

.......................................................................................................


లయ్యెన్ = పాలుపడవలసి వచ్చెను, పన్నగకల్పుతోన్ = శేషుఁడు సెజ్జ గాఁగ విష్ణునితో, తన్ను మోచిన చోట = తన్ను పోషించి భరించునట్టి స్వామియెడల తగవు అట్టె పెట్టి మిన్నక సురిఁగినన్ = ధర్మమును జేయక యట్లె దిగవిడిచి యూ రక మఱుఁగుపడినయెడల, రూఢిగాన్ =గట్టిగా, ఆడిక =నింద, తలగూడెన్ - సంభవించెను, అభిమాన మెడ లె= గౌర ఏము తీసిపోయెను, నిందపాలై గౌరము గోలుపోయియున్న నేను బ్రతుకుట యుక్తముగాదు గాన నన్నుజంపుట య ర్హము, మీఁదన్ = ఉత్తర కాలమందు- లేక పరలోకమందు- లేక జన్మాంతర,మ