పుట:Haindava-Swarajyamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
292

హరిశ్చంద్రోపాఖ్యానము

మింగ నెచ్చటనుండి మృత్యువై వచ్చె
నాఁడుదొంగలు దురుచైరి పో భువిని ......................2390
బోఁడిగా బిడ్డలఁ బొరుగిండ్ల నుంచి
నిదుర వోవఁగఁ బాసె నేఁటితో మనకు
నిది మహాపద వుట్టె నీపట్టణమున
వదలక నిటువంటివారికి నెల్ల
బెదరుగా దీనిఁ జంపినఁగాని పిదప
ఢాక గాదనువారు 'తగ దాటదాని
నేకల్ల నేసిన నిటు పట్టి చంప
నొలికి ద్రిప్పుడు మేను నొక చోటు గోసి
తలగి పొమ్మందురు తనభూమి వెడలి
యీలోకకల్యాణి కీమానవతికి......................................2400
నేలీల నీనింద యెసఁగెనో రొని
పరికించి చూడ నేపట్టున నై న
బరమాణువంత పాపము గాన మెన్న
డులుకుచు దొంగ దా నొక చోట నుండు
నొలయ నవిశ్వాస మొక చోట నుండు
నాఁట దానికి వశ మమ్ముయీ మేటి

.........................................................................................................

నేఁటితో మనకు బిడ్డలను పొరుగిండ్ల కేని పంపినను వారచట నెమ్మది గాను దురనునమిక తో నిదురపోవుటమనకు నేఁటితో తీరెననిభావము - పొరుగిండ్లకు గూడి బంపరాచయ్యె నని భావము. ఢాక = భయము-హద్దు, ఆఁటదానికిన్ : ఆడు దానిని ఒలికి త్రిప్పుడు = పీనుఁగునుజంపి త్రిప్పఁగా, మేనునొక చోటగోసి దేహములో ఏదేనొక భాగమునుగోసీ, ఉలుకుచు ...నుండు = దొంగయులుకుచ తానగపడక యొక చోటనుండును. అపనమ్మకము దొంగ కానట్టి మరొక్కరి