పుట:Haindava-Swarajyamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
-284

హరిశ్చంద్రోపాఖ్యానము.

పస నైనముత్యాలపల్లకీ లేవి.................................2230
యా తేజ మారూప మాభుజాగర్వ
మా తెల్వి యాభాగ్య మారాజసంబు
నెక్కడ నుడి వోయె నెక్కడ నడఁగె
నెక్కడఁ దుద మొద లీదురవస్థ
కక్కటా' యని యేడ్చు నతివచి త్తంబు
వెక్కఁ గౌగిటఁ జేర్చి భూవల్ల భుండు
ముప్పిరి గొనుమూర్ఛ మునిఁగి యొక్కింత
తెప్పిటి ధైర్యంబు దిగ జాఱఁ దన్ను
గప్పిన పుత్రశోకంబున మునిఁగి
విప్పారు కన్నుల నేన నశ్రు లొలుకఁ........................2240
గొడుకు రూపంబును గుణవిశేషంబు
నడుపును ముద్దును నగవుఁ దేజంబుఁ
బలుమాఱు నంకించి పలవించు విభునిఁ
గెలుపుచుఁ జంద్రమతీ దేవి పలికె
“భానుకు లేశ యీ పగిది నిద్దఱముఁ
బూని యేడ్చుచు నున్నఁ బొసఁగ దీసఁద
వివరింపు మిదె ప్రొద్దు వేగుజా మయ్యె
గదిసిన చిమ్మచీకటి వెల్లఁబారె

.................................................................................................................

కీలుపంజుల= కీలుగల దివిటీలయు, డాలు వసనైన= కాంతి నీటుగులుకునట్టి, ఉ డివోయెన్= తీసిపోయెను, ,ఈదురవస్థకు తుద మొద లెక్కడ?' అని యన్వ యము, విప్పు ఆరుక న్ను లకన్ =విశాలత నిండిన కన్ను లందు =పూర్ణ వైశాల్య ముగల కన్ను లందనుట, అంకించి= పొగడి, వివరింపుము=వివేచింపుము, ప్రొద్దు నేను జాము= సూర్యుఁ డుదయించు సమయము, ఏతేక = రాక, ఏలిక సాని=