పుట:Haindava-Swarajyamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
282

హరిశ్చంద్రోపాఖ్యానము.

నోపక వచ్చి తా నున్న వాఁ డిచటఁ
గాటిలోఁ గాననికన్నుల నున్న
చోట ని న్ని బృంగి శోకాబ్దిముంప
దలఁచి మమ్మిటుఁ దెచ్చి దై నంబు నీకుఁ
దెలిపెనే' యనుచు నద్దినక రకులుని
యడుగుల పై వ్రాలి యశ్రువు లురిలి
మడుఁగు గట్టఁగఁ జంద్రనుతి విలపించు
'నో సార్వభౌమ నీ వున్నయీమంచ
భాసురరత్న సభామంటపంబె......................................2210
పటుభూత బేతాళ పంక్తులు వీర
భటపరివారక ప్రకరంబె నీకుఁ
బెను పొందుచితివహ్ని భీకరశిఖలు
ఘనతరకరదీపికాసహసములె
చదలఁ గ్రిక్కితీసినశవధూమపుంజు
మది భవ త్కేళినీలాత పత్రము లే

............................................................................................................

మనస్సు, నా పొటు ... నున్న వాఁడిచట= నేను పడుపాట్లను జూడఁజాలక యి చ్చటికి వచ్చియున్న వాడు అని యు త్ప్రేక్ష. కావనిగన్నుల నున్న చోట= వెలుపలి సంగతు లొక్కటిని దెలిసికొన కుండునట్టి కన్నులతోనున్న యిచ్చో ట- వెలుపల జరుగు సుఖదుఃఖములు పాటింప వీలు లేక నీవిచ్చటనుండఁగా ననఁట. శోకాభిన్ =దుఃఖసముద్రమునందు, మడుఁగుగట్టగన్ = మడుఁగులు గా ఏర్పడఁ - వెల్లువలుగా కాఱఁగా ననుట, ప్రకరంబె= సమూహమా, పెనుపు ... శిఖ లు=వర్ధిల్లుచున్న సొదనిప్పుల భయంకర జ్వాలలు, ఘనతర ... సహస్రము లె=మి క్కిలి గొప్పవైన వేనవేలు చేది వ్వెలా, చదలన్ = ఆకాశమున, క్రిక్కిరిసిన - పుంజము = దట్టముగా పర్వినపీనుగు పొగ లసమూహము, భవత్ కేళినీ లాతపత్రము లే= నీయొక్క విలాసార్ధ మైన నల్లని గొడుగులా, శూల... జాలం