పుట:Haindava-Swarajyamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

ఇంగ్లండు స్థితి.

కావలసియుండును. "అభిసారిక" యనుటలో మీభావమేమో తెలుపుదురా?


సంపా: మీరు నాయభిప్రాయములను వెంటనే యంగీకరింపకుండుట న్యాయమే. ఈ విషయమున ప్రకటితమైన వాజ్మయము మీరు చదివినచో దీని సంగతి మీకు తెలియును. ఇంగ్లీషు రాజ్యాంగ సభకు నాథుడు లేడు. ముఖ్యమంత్రి హయాములో దాని బ్రతుకు తిన్నగా నడువదు. అభిసారిక బ్రదుకుబోలె అటునిటు డోలాయిత మగుచుండును. ముఖ్యమంత్రికి ముఖ్యోద్దేశము తనయధి కారమే, రాజ్యాంగ సభ యొక్క మేలుకాదు. అతని శక్తియంతయు తనకక్ష వారివిజయమును సంపాదించుటకే వ్యయపడుచున్నది. కాబట్టి రాజ్యాంగ సభ ధర్మ మొనర్చుచున్నదా యనుట యతని కంతగా నవసరముండదు. కొందరు ముఖ్యమంత్రులు తమకక్ష యొక్క లాభమునుకోరి రా జ్యాంగ సభ చే ఎట్టికార్యమునేని చేయించిర నుటకు ఆధారము కలదు. ఇదంతయు ఆలోచనీయము.


చదువరి: ఇదివరలో మన మెవరెవరు దేశభక్తు లనుకొను చుంటిమో యెవరెవరు ధర్మపరులను కొనుచుంటిమో వారినే మీరు తూలనాడుచున్నారు.


సంపా: అవును నిజమే. ముఖ్యమంత్రులపై నాకు ద్వేషమేమి లేదు. కాని నేను చూచిన దానినిపట్టి వారు నిజముగా దేశాభి