పుట:Haindava-Swarajyamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

281

గాటిపాపని కేల కరుణ నీమీద
లేకున్న నాకిచ్చు లెక్కకుఁ జెల్లు
గైకొందు నిమ్ము నీ కట్టినమినుకు”
నావుడు నుల్కి యానాతి చిత్తమున
భావింపఁ దన పతిభక్తి పెంపునను
బొడగాన రాదన్యపురుషులకేరి
కొడికమై నామెడ నున్న యీమినుకు
యితఁడె హరిశ్చంద్రుఁ డిక నేమి శంక
మతిలోన ననుచు నమానవాధీశుఁ ...............................2190
డున్న దుర్దశకు బిట్టుల్లంబు గలఁగి
తన్నుఁ దా నెఱుఁగక ధరమీఁద వ్రాలి
ధృతి పెట్టి కేలకుఁ దెలసి 'హా నాథ
సతతదయాలోల సత్యసంశీల
హా హరిశ్చంద్ర రావయ్య నీ పుత్రు
లోహితాస్యునిఁ బదలోచనుఁ జూడు
ముందు నీతొడల పై ముదమున నిద్ర
జెందినగతి నేఁడు చిత్తంబు పొక్క
బన్ని నచితిమీఁదఁ బడి దీర్ఘనిద్ర
నున్నాఁడు మేల్కొనఁ డొక మరి యైన..............................2200
నా పుత్రరత్నంబు నా పాటుఁ జూడ

.............................................................................................................

నాకు లేదనుట, 'కాటి పాపనికి = వల్లె కాటిలోని వానికి, నీ పలుకియ్యఁ గొనఁగఁ గాటి పాపనికి నీ మీఁదఁ గరుణయేల అనియన్వయము. చెల్లు- చెల్లు గా, మినుకు = తాలి,బొట్టు, నావుడున్ = అనఁ గా, ఉల్కి =అదిరి, నాతి = స్త్రీ, పొడగాన రాదు=కనుట కలవి గాదు, ఒడిక మై=మనోహరమై, బిట్టు= మిక్కిలి, ఉల్లంబు=